విశ్వక్ సక్సెస్ రేటు మాములుగా లేదు
కమర్షియల్ గా విజయ్ ఇమేజ్ కాస్తా ఎక్కువగా ఉన్న సక్సెస్ ల పరంగా విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉన్నాడని చెప్పాలి
టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో దూసుకుపోతున్న హీరో విశ్వక్ సేన్. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తనదైన శైలిలో క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుంటూ ఆడియన్స్ కి మంచి కంటెంట్ ను అందించడమే లక్ష్యంగా విశ్వక్ సేన్ మూవీస్ చేస్తున్నాడు. తెలంగాణ నుంచి విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ మధ్య మంచి పోటీ నడుస్తూ ఉంది. కమర్షియల్ గా విజయ్ ఇమేజ్ కాస్తా ఎక్కువగా ఉన్న సక్సెస్ ల పరంగా విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉన్నాడని చెప్పాలి.
2009లోనే జగపతిబాబు నటించిన బంగారు బాబు సినిమా ద్వారా సిశ్వక్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అనంతరం వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో విశ్వక్ సేన్ బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తరువాత సోలో హీరోగా ఫలక్ నుమా దాస్ తో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా కూడా విశ్వక్ సేన్ ప్రూవ్ చేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది ఫస్ట్ కేస్ మూవీలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సీరియస్ రోల్ లో నటించి హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ పాగల్ అంటూ డిఫరెంట్ కమర్షియల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా బాగుందనే టాక్ తెచ్చుకొని అబౌవ్ ఏవరేజ్ గా నిలిచింది.
తరువాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీతో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా విశ్వక్ సేన్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ చేసింది. గత ఏడాది దాస్ కా ధమ్కీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని విశ్వక్ అందుకున్నాడు. ఒకవైపు యూత్ ని మరోవైపు ఫ్యామిలీ ఆడియెన్స్ అలాగే ఆలోచింప జేసీ థ్రిల్లర్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ అన్ని వర్గాల వారికి దగ్గరవుతున్నాడు.
హీరోగానే కాకుండా మేకర్ గా కూడా విశ్వక్ సూపర్ సక్సెస్ కొట్టడం విశేషం. తాజాగా వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ గామి కూడా హిట్ బొమ్మగా విశ్వక్ ఖాతాలో చేరింది. ఈ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కి సిద్ధం అవుతోంది.
ఇప్పటి వరకు కెరియర్ పరంగా చూసుకుంటే 96% సక్సెస్ రేట్ ని విశ్వక్ సేన్ కొనసాగిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. మినిమమ్ బడ్జెట్ తో ప్రొడ్యూసర్స్ కి కూడా గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాకుండా మరో మూడు సినిమాల వరకు విశ్వక్ సేన్ చేతిలో ఉన్నాయి. వాటిలో ఫలక్ నుమా దాస్ సీక్వెల్ కూడా ఉండటం విశేషం. చూస్తుంటే విశ్వక్ త్వరలోనే మరో రేంజ్ కు వెళ్ళేలా కనిపిస్తున్నాడు.