విశ్వం నుంచి మాస్‌ ట్రీట్.. కావ్య హై గ్లామర్ డోస్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు.

Update: 2024-10-10 15:02 GMT

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు. యంగ్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకుందామని గోపీచంద్, శ్రీనువైట్ల.. చూస్తున్నారు.

ఇప్పటికే విశ్వం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్ ఓ రేంజ్ లో అలరించింది. మేకర్స్ విడుదల చేసిన పాటలు.. కూడా ఆకట్టుకున్నాయి. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవుతుందన్న వేళ.. విశ్వం మేకర్స్ మాస్ ట్రీట్ ఇచ్చారు. గుంగురూ గుంగురూ.. అంటూ సాగుతున్న పాటను విడుదల చేశారు. పండుగ సీజన్‌ లో మాస్ సాంగ్ సందడి అంటూ ట్వీట్ చేశారు.

అద్భుతమైన ఎనర్జిటిక్ ట్రాక్ గా గుంగురూ గుంగురూ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గోపీచంద్, కావ్య థాపర్.. తమ డ్యాన్స్ తో అలరించారు. మాస్ బీట్ కు తన స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. కావ్య అయితే తన సూపర్ ఎక్స్ప్రెషన్స్ తో అట్రాక్ట్ చేశారు. తన అందాల చిందులతో మైమరపించారు. గోపీచంద్, కావ్య మధ్య కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

అయితే విశ్వం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చైతన్ భరద్వాజ్ వర్క్ చేస్తున్నారు. కానీ గుంగురూ గుంగురూ సాంగ్ ను మాత్రం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఆయన గాత్రం కూడా అందించారు. రోహిణి సోరట్ తన మాస్ వాయిస్ తో సందడి చేశారు. సురేష్ గంగుల అందించిన సాహిత్యం అదిరిపోయింది. స్క్రీన్ పై సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ అని, ఆడియన్స్ అంతా ఈలలు వేస్తారని నెటిజన్లు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీను వైట్ల పలు బ్లాక్‌ బస్టర్స్‌ తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా.. విశ్వంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. మరి విశ్వం మూవీ.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News