వార్‌ 2 : హీరోల పారితోషికం మరీ అంత తక్కువనా..!

బాలీవుడ్‌ సూపర్ హిట్‌ మూవీ వార్‌ ప్రాంచైజీలో ప్రస్తుతం వార్‌ 2 రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే.

Update: 2024-03-13 06:18 GMT

బాలీవుడ్‌ సూపర్ హిట్‌ మూవీ వార్‌ ప్రాంచైజీలో ప్రస్తుతం వార్‌ 2 రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. మార్చి నెలలో వార్‌ 2 షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లుగా కొన్ని నెలల క్రితం చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. హృతిక్‌ రోషన్ పై మొదటి షెడ్యూల్‌ ను అతి త్వరలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వార్ 2 లో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. వచ్చే నెలలో ఎన్టీఆర్‌ షూటింగ్‌ కి జాయిన్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. హృతిక్ మరియు ఎన్టీఆర్ ల కాంబో సన్నివేశాలు కచ్చితంగా మూవీ లవర్స్ కి కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటాయనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

ఇక వార్‌ 2 కోసం హృతిక్‌ రోషన్ మరియు ఎన్టీఆర్‌ లు తీసుకుంటున్న పారితోషికంతో పాటు బడ్జెట్‌ ఇంకా ఇతర విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హిందీ మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు హీరోల పారితోషికం కలిపి రూ.100 కోట్లు. మొత్తం బడ్జెట్‌ రూ.500 కోట్లుగా చెబుతున్నారు.

బాలీవుడ్‌ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలనే ఉద్దేశ్యంతో పట్టుదలతో మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ గా వార్‌ 2 ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి భారీ సినిమా లో నటిస్తున్న హీరోలు ఇద్దరికీ కలిపి వంద కోట్ల పారితోషికం అంటే ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటున్నారు.

సౌత్‌ లో అరడజను హీరోలు ఒక్కో సినిమాకు వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అలాంటిది ఇద్దరు హీరోలకు కలిపి వంద కోట్ల పారితోషికం ఏంటో అంటూ సౌత్‌ నెటిజన్స్ నెట్టింట చర్చించుకుంటున్నారు. వార్ 2 హీరోల పారితోషికం వార్తలు నిజమే అయితే అది చాలా తక్కువే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎన్టీఆర్‌ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఒక్కడికే రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల పారితోషికం అందుకోగలడు. అలాంటిది అందులో సగం పారితోషికం కు వార్‌ 2 ను ఎలా ఎన్టీఆర్‌ చేస్తాడు అంటూ ఆయన అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే హీరోల పారితోషికం విషయమై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News