హౌస్ ఫుల్ ఛాన్స్ శర్వా దక్కించుకునేనా...?
ఐపీఎల్ పూర్తి అయ్యింది, ఎన్నికల హడావిడి సర్ధుమనిగింది, వానాకాలం స్టార్ట్ అయ్యి ఎండలు తగ్గాయి.
గత రెండు నెలలుగా ఇండియన్ సినిమా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ నత్త నడక సాగించింది. ఐపీఎల్, ఎన్నికలు, ఎండలు... ఇలా అనేక కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ ల వద్ద వాతావరణం వెలవెలబోయినట్లుగా ఇన్ని రోజులు ఉన్న విషయం తెల్సిందే.
ఐపీఎల్ పూర్తి అయ్యింది, ఎన్నికల హడావిడి సర్ధుమనిగింది, వానాకాలం స్టార్ట్ అయ్యి ఎండలు తగ్గాయి. దాంతో సినిమాలు రావడం మొదలు అయ్యాయి. జూన్ నెల మొదటి వారంను శర్వానంద్ 'మనమే' సినిమా తో ప్రారంభించబోతున్నాడు. మనమే సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇన్ని రోజులు ఏ ఒక్క సినిమా కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డ్ ను చూపించలేక పోయాయి. ఇప్పుడు ఆ ఛాన్స్ శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన ఫ్యామిలీ మూవీ 'మనమే' కి ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మంచి సినిమాల కోసం మొహం వాచి ఉన్న తెలుగు ప్రేక్షకులు మనమే కి మంచి వసూళ్లు కట్టబెట్టడం ఖాయం.
మంచి సమయంలో రాబోతున్న మనమే సినిమా కి మంచి అవకాశాలు ముందు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ అనేది పెద్దగా లేదు, రెండు మూడు సినిమాలు విడుదల ఉన్నా కూడా మనమే ముందు వాటి గురించి పెద్దగా చర్చ జరగడం లేదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.
శర్వానంద్ కాస్త ఎక్కువ గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో పాటు, సేఫ్ టైమ్ లో రానున్న కారణంగా పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపించే అకవాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది బాక్సాఫీస్ వర్గాల అంచనా.
మరి శర్వానంద్ మనమే సినిమా ఆ మోస్తరు పాజిటివ్ టాక్ ను అయినా సొంతం చేసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మనమే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చాలా కాలం తర్వాత ఒక తెలుగు ఆల్బమ్ లో 16 పాటలు ఉండటం ఈ సినిమా విశేషం. ఈ వారంలో విడుదల కాబోతున్న మనమే సినిమా తో కృతి శెట్టి బ్యాక్ టు ఫామ్ రావాలని ఆశిస్తుంది. అంతే కాకుండా శర్వానంద్ కూడా ఓ గట్టి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాడు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.