అసలు సంపూర్ణేష్ బాబు ఎక్కడ?

2014లో పూర్తిస్థాయిలో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సంపూర్ణేష్ బాబు మూవీస్ బాగానే చేశాడు.

Update: 2024-09-20 01:30 GMT

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అంటే టాలీవుడ్ లో తెలియని వారు ఉండరు. ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’, ‘కొబ్బరిమట్ట’ సినిమాల ద్వారా కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. స్పూఫ్ అండ్ సెటైరికల్ కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా సంపూర్ణేష్ బాబు మారాడు. కొన్ని సినిమాలలో కమెడియన్ గా కూడా సంపూర్ణేష్ బాబు నటించి మెప్పించాడు. 2014లో పూర్తిస్థాయిలో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సంపూర్ణేష్ బాబు మూవీస్ బాగానే చేశాడు.

సరైన క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా సంపూర్ణేష్ బాబు ఈపాటికే గుర్తింపు పొందేవాడు. అయితే ఎందుకనో ఆయనకి పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదు. తన లుక్, ఆహార్యంతోనే నవ్వించే సంపూర్ణేష్ బాబుతో చాలా రకాల క్యారెక్టర్స్ చేయొచ్చు. కానీ పెద్దగా ఛాన్స్ లు ఇచ్చి ప్రోత్సహించడం లేదనే మాట వినిపిస్తోంది. సంపూర్ణేష్ బాబు చివరిగా గత ఏడాది మార్టిన్ లూథర్ కింగ్ అనే మూవీలో నటించాడు. ఇది తమిళ్ హిట్ మూవీకి రీమేక్ గా వచ్చింది.

సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అయితే సంపూర్ణేష్ బాబు పెద్దగా లైమ్ లైట్ లో కనిపించడం లేదు. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఆయన గురించి చర్చ కూడా లేదు. ఇంతకి సంపూర్ణేష్ బాబు ఏమైపోయాడు అనే ప్రశ్న వినిపిస్తోంది. నిజానికి సంపూర్ణేష్ బాబు కూడా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలని అనుకోడు. అందుకే హైదరాబాద్ కి దూరంగా సిద్ధిపేట దగ్గరలో సొంతూరిలోనే స్వర్ణకారుడిగా తన కులవృత్తి చేసుకుంటున్నాడు.

ఎవరైనా సినిమా క్యారెక్టర్స్ ఉన్నాయని చెబితే హైదరాబాద్ వస్తాడు. మరల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిద్ధిపేట వెళ్ళిపోతారు. సొంతూరిలో కుటుంబంతో కలిసి చాలా సింపుల్ లైఫ్ ని సంపూర్ణేష్ బాబు లీడ్ చేస్తున్నారు. అయితే లైమ్ లైట్ లో లేకపోయిన కూడా ఆయన సినిమాలు మాత్రం చేస్తున్నాడంట. ఇప్పటికే రెండు సినిమాలలో నటించాడు. ఆ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. అవి రిలీజ్ అయితే మరల సంపూర్ణేష్ బాబు సందడి ఉంటుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో క్వాలిటీ కమెడియన్స్ కొరత ఉంది. గట్టిగా చూసుకుంటే వెన్నెల కిషోర్, సత్య తరువాత ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటివారే కనిపిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ ఉన్న కూడా సినిమా మొత్తం కామెడీ ట్రాక్ లీడ్ చేసే స్థాయిలో లేరనే మాట వినిపిస్తోంది. అందుకే సంపూర్ణేష్ బాబు లాంటివారిని ఎంకరేజ్ చేస్తే స్టార్ కమెడియన్ అయ్యే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News