రాజకీయం- సినిమా! తారక్ తొలి ఆప్షన్ ఏది అంటే?
కానీ ఇది ఇంత వరకూ జరగలేదు. ఇవి కేవలం ప్రచారం వరకే పరిమితమయ్యాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల అనంతరం రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన టీడీపీ పార్టీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేసారు. ఆయన మాట తీరు.. జ్ఞానం..ప్రజలపై ఆయన చూపించే ప్రేమాభిమానాలు అన్నీ చూసి తారక్ మంచి నాయకుడిగా అవుతాడని అప్పటి నుంచి అభిమానులు భావిస్తున్నారు.
కానీ ఇది ఇంత వరకూ జరగలేదు. ఇవి కేవలం ప్రచారం వరకే పరిమితమయ్యాయి. ఆయన రాజకీయాల్లోకి రావడానికి...చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని అంత వరకూ సినిమాలు మాత్రమే చేస్తారని భావించిన అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `ఆది` సినిమా చేయడం తాను తీసుకున్న ఓ మంచి నిర్ణయం అన్నారు.
'17 ఏళ్ల వయసులో తొలి సినిమా చేసాను. అప్పటి నుంచి నా చూపు నటనవైపే ఉంది. ఓట్ల సంగతి అలా ఉంచితే నా కోసం టికెట్లు కొంటున్నారు. ఇంతమంది ప్రజల్ని కలుస్తున్నాను. ఇది నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. నటుడిగా ఎంతో సంతోషంగా ఉన్నాను` అన్నారు. ఆయన హీరోగా నటించిన `దేవర` బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో సినిమా అభిమానుల్ని అలరిస్తుంది.
తారక్ నుంచి మరో మాస్ హిట్ గా అభిమానులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫెయిలైన నేపథ్యంలో సక్సెస్ మీట్ భారీ ఎత్తున నిర్వహించాలని రెడీ అవుతున్నారు. అమెరికాలో ఉన్న తారక్ రేపు హైదరాబాద్ బయల్దేరతారు.