సలార్ వస్తే ఏంటి.. కన్నడ హీరో ఘాటైన కాన్ఫిడెన్స్
ఇక ఇప్పుడు డిసెంబర్ నెలలో భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తున్నాయి.
పోటీలో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్ కొట్టడం అన్నీ సార్లు వర్కౌట్ అవ్వదు. ఏమాత్రం తేడా వచ్చినా అడ్రస్ లేకుండా పోతాయి. పాన్ ఇండియా కాలంలో ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే తేడా ఆడియెన్స్ అసలు పట్టించుకోవడం లేదు. 250 రూపాయలు రెండు గంటల విలువైన సమయంలో ఎవరు ఎంటర్టైన్మెంట్ ఇస్తే వారి సినిమాలకే ఓటేస్తున్నారు. ఇక ఇప్పుడు డిసెంబర్ నెలలో భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తున్నాయి.
యానిమల్ ఇప్పటికే ఊచకోత చూపించింది. ఇక డిసెంబర్ 21వ తేదీ డంకీతో షారుక్ సందడి చేయనుండగా.. ఆ తర్వాత రోజే సలార్ తో ప్రభాస్ థియేటర్లలోకి రానున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు హోరాహోరీగా పోటీ పడతాయని అనిపిస్తుంది. అందుకే భాషలోనూ వీటి మధ్యలో పోటికి సిద్ధపడడం లేదు. కానీ కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన కాటేరా మూవీ మాత్రం ఆ టైమ్ లో రిలీజ్ కానుంది.
ఇక ఈ పోటిపై ఆ హీరో చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రెస్ మీట్ లో సలార్- డంకీ క్లాష్ గురించి ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను సలార్ లేదా ఇతర సినిమాలను అస్సలు పట్టించుకోను. పోటీ పడాలంటే వాళ్లే మనకు భయపడాలి. నాది ప్యూర్ కన్నడ చిత్రం. కన్నడ ప్రేక్షకులు నా సినిమాపై ప్రేమ చూపిస్తారని నమ్ముతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక దర్శన్ చేసిన వ్యాఖ్యలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే డిసెంబర్ 22వ తేదీనే సినిమా విడుదల చేయాల్సిందని కామెంట్లు పెడుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాష, ప్రాంతీయత బేధాలు పూర్తిగా పోయాయని చెప్పొచ్చు. దాదాపు సినిమాలన్నీ వివిధ భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. పలు దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో స్టార్ హీరో దర్శన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలుగుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దర్శన్ ఇలా సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదని అంటున్నారు.
అయితే కాటేరా సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను ఇంతవరకు మేకర్స్ వెల్లడించలేదు. తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టోరీ.. ఓ రైతు నిజ జీవిత సంఘటన చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ మూవీతో సీనియర్ నటి మాలా శ్రీ కుమార్తె ఆరాధన.. సినీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సలార్, డంకీ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవర్సీస్ లో కొద్ది రోజుల ముందే మొదలవ్వగా.. ఇటీవలే భారత్ లో స్టార్ట్ అయ్యాయి. యూఎస్ లో సుమారు 25వేల టిక్కెట్ల విక్రయాల ద్వారా సలార్ ఇప్పటి వరకు దాదాపు రూ. 5కోట్లకుపైగా వసూలు చేసిందట. డంకీ కూడా ప్రీ బుకింగ్స్ లో భారీ గానే వసూలు చేస్తోందట.