అకీరాని హీరోగా ఒప్పించాల్సింది ఆమె బాధ్యతా?
నాన్నపై తనకున్న ప్రేమనంత టిని ఒక్కసారిగా చాటేస్తున్నాడు.
అకీరా నందన్ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచిన పేరు. ఇంతవరకూ సైలెంట్ గా ఉన్న అకీరా డాడ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచేసరికి ఒక్కసారిగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. నాన్నపై తనకున్న ప్రేమనంత టిని ఒక్కసారిగా చాటేస్తున్నాడు. పీకే పాత వీడియోల్ని ఎడిట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో తన సంగీతాన్ని జోడీంచడం.. విక్టరీ సాంధించినందుకు గర్వపడిన మూవ్ మెంట్ ఇలా ప్రతీ విషయంలో పీకే ఫ్యాన్స్ లో అకీరా హాట్ టాపిక్ అయ్యాడు.
ఇదే సమయంలో రేణు దేశాయ్ అకీరా ఇన్ స్టా ఐడీలను హైడ్ చేయడం వంటివి కూడా జరిగాయి. ఓ తల్లిగా అకీరాకి అన్నిరకాలుగా మద్దతిస్తుంది రేణు దేశాయ్. భవిష్యత్ లో ఎలాంటి ప్రయాణిన్ని నిర్దేశించుకుంటాడు? అన్న దానిపై పూర్తి స్వేచ్ఛని ఇచ్చేసింది. పిల్లల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఏనాడు ఒత్తిడి తీసుకురాలేదు. వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉంటారు? ఇష్టమైన రంగాల్లోనే కొనసాగుతారు అన్నట్లు పవన్ వైఖరి కనిపిస్తుంది.
అకీరాకి సంగీతమంటే ప్రాణం. నటనకంతే సంగీతానికి తొలి ప్రాధాన్య ఇచ్చాడని ఆ ఆసక్తిని బట్టే తెలుస్తోంది.
కానీ ఇక్కడ సన్నివేశం మరోలా కనిపిస్తుంది. అకీరా సంగీత దర్శకుడైతే మా పరిస్థితి ఏంటి అని పవన్ అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా అకీరా ఎడిట్లు చూసి అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ కుమారుడు కూడా నటుడిగా అరంగేట్రం చేయాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చుకోవాల్సిన సన్నివేశం ఎదురైంది.
'అకిరా పుట్టిన క్షణం నుండి నేను అతని మొదటి అభిమానిని అర్థం చేసుకోండి. నటనవైపు వస్తాడని నేను కూడా ఆశిస్తున్నాను. అయితే నేను అతని నిర్ణయాన్ని. భావాలను గౌరవించాలి. కాబట్టి అతని నటనా రంగ ప్రవేశానికి సంబంధించి నన్ను ఇబ్బంది పెట్టొద్దు' అన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే రేణు దేశాయ్ ... కుమారుడిని హైడ్ చేస్తున్నట్లు మరికొంత మంది అభిమానులు భావిస్తున్నారు. అకీరా నటుడిగా మ్యాకప్ వేసుకోవడానికి రేణు దేశాయ్ అంగీకరించదు అని అంటున్నారు.
ఈ వ్యాఖ్యలను చూసిన రేణు తీవ్ర మనస్తాపానికి గురై దీనిపై మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 'ఇది అతని జీవితం. అకీరా ఏమి చేయాలనేది అతని కోరికపై ఆధారపడి ఉంటుంది. అతని తల్లిగా నేను వంద శాతం మద్దతు ఇస్తాను' అని అన్నారు. అకీరా నందన్ వయసు ఇంకా 20 ఏళ్లే. అప్పుడే అభిమానలు నుంచి ఈ రేంజ్ లో బ్యాటింగ్ మొదలైంది అంటే! 25 ఏళ్లు వచ్చే సరికి పరిస్థితి ఎలా ఉంటుందో.