రాజకీయాలతో నలిగిపోతున్న కంగన?
తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో కంగన రాజకీయ ఒత్తిళ్ల గురించి ప్రస్థావించింది.
క్వీన్ కంగన రనౌత్ సినిమాలు, రాజకీయాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఇటీవల రాజకీయనాయకురాలిగా మారాక సెట్స్ పై ఉన్న తన సినిమాల రిలీజ్ కష్టంగా మారుతోంది. ఇప్పటికే కంగన ఇల్లు ఆస్తులు అమ్మి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `ఎమర్జెన్సీ` విడుదలకు నోచుకోకపోవడంతో అది కంగనలో ఆందోళన పెంచుతోంది.
తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో కంగన రాజకీయ ఒత్తిళ్ల గురించి ప్రస్థావించింది. సినీరంగంపై టూమచ్ గా రాజకీయాలు చేస్తున్నారంటూ కంగన దుయ్యబట్టింది. అంతేకాదు ఇటీవల తన వరుస బాక్సాఫీస్ వైఫల్యాల వెనక కూడా రాజకీయాలు ఉన్నాయన్నట్టు సందేహిస్తూ మాట్లాడింది. ప్రస్తుతానికి తన రాజకీయ ప్రయాణం వల్ల సినిమాల్ని ఆపి ఉంచానని కూడా కంగన వ్యాఖ్యానించింది.
అంతేకాదు కంగనా రనౌత్ ఇందిరా గాంధీ జీవితాన్ని `ఎమర్జెన్సీ` విడుదలకు ముందు `షేక్స్‌పియర్ విషాదం`తో పోల్చారు. చరిత్రాత్మక రాజకీయ నాటకం `ఎమర్జెన్సీ` ని విడుదల చేసేందుకు కంగన ప్రయత్నిస్తోంది. ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాలనలో 1975-1977 ఎమర్జెన్సీ కాలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగన పోషించింది.
కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుండి భాజపా ఎంపి అయినందున ఇలాంటి సమయంలో ఇందిరమ్మ జీవితంపై సినిమా తీస్తుంటే అది కాంగ్రెస్ పార్టీ పరిశీలనతో ఇబ్బంది పడుతోందని అర్థమవుతోంది. రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుండి కంగనా తన సినిమా ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి చాలా కష్టపడుతోంది. ఈ సందర్భంగా క్వీన్ మాట్లాడుతూ.. ``నా సినిమా పనులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నా ప్రాజెక్టులు వెయిటింగులో ఉన్నాయి. నేను నా షూటింగ్‌లు ప్రారంభించలేకపోతున్నాను. శీతాకాలపు సెషన్ వంటి మరిన్ని పార్లమెంటరీ సెషన్ల కోసం ఎదురు చూస్తున్నాను`` అని అంది. కాల్షీట్లు సర్ధుబాటు చేయడం కష్టంగా ఉందని కూడా తెలిపింది.