వీడియో : సూపర్ స్టార్ పాట అంటే ఇంతే మరి
ఇండియాలో ఏ స్థాయిలో రజినీకాంత్ కి అభిమానులు ఉంటారో అదే స్థాయిలో జపాన్ లో కూడా ఉంటారు అనే విషయం గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. ఇండియాలో ఏ స్థాయిలో రజినీకాంత్ కి అభిమానులు ఉంటారో అదే స్థాయిలో జపాన్ లో కూడా ఉంటారు అనే విషయం గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా ఆ విషయం మళ్లీ నిర్ధారణ అయ్యింది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక వీడియో రజినీకాంత్ స్టామినా ఏంటి.. ఆయన పాటలకు ఉన్న గుర్తింపు ఏంటి అనేది తెలియజేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... పాండిచ్చేరి యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్ కుబోకి శాన్ వచ్చారు.
కార్యక్రమంలో కుబోకి శాన్ మాట్లాడుతూ తన స్పీచ్ మధ్యలో రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ ముత్తు పాట అందుకున్నాడు. ఆ పాటను పాడుతూ మెల్లగా స్టెప్స్ కూడా వేశాడు. 77 ఏళ్ల వయసులో కుబోకి పాట పాడుతూ డాన్స్ చేయడం.. అది కూడా రజినీకాంత్ పాట అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మూడు దశాబ్దాల క్రితం విడుదల అయిన ముత్తు సినిమా ఇండియాలో ఏ స్థాయిలో విజయం సాధించిందో అంతకు మించి అన్నట్లుగా జపాన్ లో కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్ లో ముత్తు సాధించిన వసూళ్ల రికార్డ్ ను ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా బ్రేక్ చేయలేదు అనేది ఒక టాక్.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ముత్తు అంటే జపాన్ ప్రేక్షకులకు ఇప్పటికి కూడా అభిమానమే అని ఈ సంఘటనతో మరోసారి నిరూపితం అయ్యిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వృద్దులకు కూడా రజినీకాంత్ పాటలు ఊపు తెప్పిస్తాయని ఈ వీడియోకు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు తమిళ సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ముత్తు పాటను ఈ వయసులో ఇంత బాగా పాడుతూ, డాన్స్ చేయడం గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మా సూపర్ స్టార్ పాట అంటే ఇంతే మరి అన్నట్లుగా ఆనందంగా ట్వీట్స్ చేస్తున్నారు.