మ్యాడ్‌ 2 వచ్చేది ఎప్పుడంటే..!

సినిమా నిర్మాతలు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను సొంతం చేసుకున్నారు.

Update: 2024-12-13 21:30 GMT

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల్లోనూ డీసెంట్‌ వసూళ్లు రాబట్టింది. సినిమా నిర్మాతలు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలను సొంతం చేసుకున్నారు. ముగ్గురు మిత్రులు కాలేజ్‌లో ఏం చేశారు, వారు తమ జీవితంలో ఎలా ముందుకు వెళ్లారు అనేది సినిమా కథగా చేయడం జరిగింది. ఇప్పుడు మ్యాడ్‌ 2 సినిమా రూపొందింది.

ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల మ్యాడ్‌ 2 ను విడుదల చేయలేక పోయారు. మ్యాడ్‌ 2 సినిమాను ఎట్టకేలకు శివ రాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 26వ తారీకున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి, సమ్మర్‌ లో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అందుకే ఫిబ్రవరి నెలలోనే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

మ్యాడ్‌ 2 లో అదే ముగ్గురు హీరోల పాత్రలు ఉండబోతున్నాయి. కాలేజ్ చదువులు పూర్తి చేసుకున్న హీరోలు వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, భర్తలుగా వారు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి, ఉద్యోగాల్లో వారు పడే బాధలు ఏంటి అనేది సినిమా కథలో చూపించబోతున్నారు అనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. మ్యాడ్‌ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే లడ్డు గాడి పెళ్లి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఫిబ్రవరిలో నాగ చైతన్య నటిస్తున్న తండేల్‌ సినిమా విడుదల కాబోతుంది. కనుక ఆ సినిమా తర్వాత ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలలోను సినిమాలకు అన్‌ సీజన్‌గా అనుకుంటూ ఉంటారు. అయితే సినిమాకు పాజిటివ్‌ టాక్ వస్తే, హిట్‌ టాక్ వస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. కనుక మ్యాడ్‌ 2 సినిమా మహాశివ రాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. మ్యాడ్‌ సినిమాలో నార్నె నితిన్‌, సంతోష్ శోభన్‌, రామ్‌ నితిన్‌లు హీరోలుగా నటించారు. సీక్వెల్‌లోనూ వారే కంటిన్యూ అవ్వబోతున్నారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా వినోదంతో వారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Tags:    

Similar News