టాలీవుడ్ ప్రేమ జంట సీక్రెట్ పెళ్లి ప్లాన్స్?
మునుముందు ఇలా సీక్రెట్ గానో లేదా ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గానో పెళ్లాడే సెలబ్రిటీలు ఎవరున్నారు? అన్న చర్చ సాగుతోంది.
ఇటీవలి కాలంలో తాప్సీ- మాథియాస్ బౌ పెళ్లి సీక్రెట్ గా జరిగింది. ఆ తర్వాత సిద్ధార్థ్ - అదితి రావ్ హైదరీ పెళ్లి కూడా సైలెంట్ గా ఎలాంటి ప్రచార హంగామా లేకుండా వనపర్తిలోని పురాతన దేవాలయంలో పెళ్లాడేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి. మునుముందు ఇలా సీక్రెట్ గానో లేదా ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గానో పెళ్లాడే సెలబ్రిటీలు ఎవరున్నారు? అన్న చర్చ సాగుతోంది.
అంతేకాదు.. శోభిత ధూళిపాలను పెళ్లాడుతున్న నాగచైతన్య కూడా ఇలా చేస్తాడా? అంటూ గుసగుస వినిపిస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రచార హంగామా లేకుండా శోభిత-చై పెళ్లి జరిగేందుకు ఆస్కారం ఎక్కువేనని విశ్లేషిస్తున్నారు. ఈ అందమైన జంట ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రాజస్థాన్‌లో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. బంధుమిత్రులు, ఇతరులను పిలవాల్సిన పని లేకుండా దీనిని ట్రెడిషనల్ గా సింపుల్ గా కానిచ్చేస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దేనికీ అధికారిక నిర్థారణ లేదు.
నాగచైతన్య కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో శోభిత కూడా వరుస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంది. వారు తమ కమిట్ మెంట్లు పూర్తి చేస్తూనే పెళ్లి ఘడియల కోసం వేచి చూస్తున్నారు. అక్కినేని - ధూళిపాల కుటుంబాలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నాయి.