బిగ్ బాస్ 8 : మెగా చీఫ్ గా గెలిచింది ఎవరంటే..?

రెడ్ టీం నుంచి ప్రేరణ ఒక్కతే పోటీలో ఉండగా గ్రీన్ టీం నుంచి తేజ, నబీల్ ఉన్నారు.

Update: 2024-10-31 16:35 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో 9వ వారం మెగా చీఫ్ టాస్క్ నిన్నటి వరకు జరిగింది. ఈ వారం మెగా చీఫ్ కోసం కంటెస్టెంట్స్ అందరినీ ఒకే మెగా క్లాన్ గా మార్చి వాళ్లని నాలుగు టీంలుగా విడగొట్టి ఐదు టాస్కులు ఇచ్చాడు. వాటిలో ప్రతి టాస్క్ ని ఒక టీం గెలిచి మిగతా టీం కి యెల్లో కార్డ్ ఇచ్చారు. ఈ క్రమంలో 9వ వారం మెగా చీఫ్ ఫైనల్ టాస్క్ లో ఎక్కువ టాస్క్ లు గెలిచిన బ్లూ టీం నుంచి హరితేజ, నిఖిల్, అవినాష్ నిలిచారు. రెడ్ టీం నుంచి ప్రేరణ ఒక్కతే పోటీలో ఉండగా గ్రీన్ టీం నుంచి తేజ, నబీల్ ఉన్నారు.

ఫైనల్ గా మెగా చీఫ్ అయ్యేందుకు వారందరికీ తిరుగుతూనే ఉండు గెలిచే వరకు టాస్క్ ఇచ్చారు. బస్తాలో వారికిచ్చిన వాటిని కాపాడుకుంటూ రౌండ్ గా తిరుగుతూనే ఉండాలి. ఈ టాస్క్ లో ఎవరైతే చివరి వరకు ఉంటారో వారే మెగా చీఫ్ అవుతారు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ టాస్క్ లో అవినాష్ చివరి వరకు బ్యాగ్ తో ఉన్నాడు. దాని వల్ల 10వ వారానికి మెగా చీఫ్ గా అవినాష్ నిలిచాడు.

అవినాష్ మెగా చీఫ్ అవ్వడం అతని ఫ్యాన్స్ అందరినీ ఖుషి చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అవినాష్ తన ఆట తీరుతోనే కాదు ఎంటర్టైనింగ్ తో హౌస్ అంతా ఒకచోటికి వచ్చేలా చేస్తున్నాడు. కచ్చితంగా అవినాష్ వచ్చాక ఈ సీజన్ ఎంటర్టైనింగ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఐతే అవినాష్ మెగా చీఫ్ గా ఎలా చేస్తాడు. నెక్స్ట్ ఇమ్యునిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ సేవింగ్ అనేది తన చేతికి ఇస్తే నామినేషన్స్ నుంచి ఎవరిని సేవ్ చేస్తాడు లాంటి విషయాలు చూడాలి.

అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా వచ్చాడు. ఐతే అప్పుడు 12 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఐతే ఈసారి టాప్ 5 పై గురి పెట్టి ఉన్నాడు. కచ్చితంగా అతని దూకుడు చూస్తుంటే టాప్ 5 బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నట్టే ఉన్నాడు. ఐతే ఇంకా ఆరు వారాల దాకా ఆట ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ టాస్కుల పరంగా ఒక రేంజ్ లో కాకపోయినా సరే ఎంటర్టైనింగ్ లో మాత్రం అతని తర్వాతే అనిపిస్తున్నాడు. ఐతే సరైన ఎపిసోడ్ ఒక్కటి అవినాష్ కి పడింది అంటే మాత్రం అతను టాప్ లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.

Full View
Tags:    

Similar News