సందీప్ రెడ్డి హీరో ఎవ‌రో? ఇంకా క్లారిటీ లేదు

అందులో ప్ర‌భాస్ హీరోగా ఎప్పుడో లాక్ అయిన నేప‌థ్యంలో అత‌నే సందీప్ హీరో అవుతాడ‌ని అంతా భావిస్తున్నారు.

Update: 2023-12-12 08:30 GMT
'అర్జున్ రెడ్డి'...'యానిమ‌ల్' తో రెండు భారీ విజ‌యాలు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ‌. దీంతో త‌దుప‌రి ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నాడు? ఏ హీరోని త‌న సినిమాలో తీసుకుంటాడు? హ్యాట్రిక్ విజ‌యాన్ని ఎవ‌రితో నమోదు చేయ‌బోతున్నాడు? వంటి అంశాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. మ‌రి సందీప్ రెడ్డి త‌దుప‌రి హీరో ఫిక్స్ అయ్యాడా? అంటే లేద‌నే తెలుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ 'స్పిరిట్' సందీప్ త‌దుప‌రి సినిమా అవుతుంద‌ని అంతా భావిస్తున్నారు.

అందులో ప్ర‌భాస్ హీరోగా ఎప్పుడో లాక్ అయిన నేప‌థ్యంలో అత‌నే సందీప్ హీరో అవుతాడ‌ని అంతా భావిస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగా ఇంకా ఏ హీరోని ఫిక్స్ అవ్వ‌లేద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసాడు. 'యానిమ‌ల్' రిలీజ్ అయిన నాలుగు రోజుల‌కు ఓ వెబ్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని తెలిపాడు. క‌థ‌లు రెడీగా ఉన్నాయ‌న్నాడు. కానీ వాటికి హీరోలు మాత్రం సిద్దంగా లేరు అని ప్ర‌క‌టించాడు.

దీంతో సందిప్ త‌దుప‌రి సినిమా ఏంటి? హీరో విష‌యంలో ఇంకా ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు లేదు. ఆ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ గురించి కూడా ప్ర‌స్తావించ‌లేదు. కాబ‌ట్టి 'స్పిరిట్' 2024 లో ప‌ట్టాలెక్కుతుంది అన్న‌ది కేవ‌లం ప్ర‌చారం త‌ప్ప అందులో వాస్త‌వం క‌నిపించ‌లేద‌ని క్లారిటీ వ‌స్తోంది. మ‌హేష్..చ‌ర‌ణ్‌..బ‌న్నీ ఇలా అగ్ర తారలంద‌రికీతో సందీప్ సినిమాలు చేస్తాన‌ని అన్నాడు. కానీ ఎవ‌రితో ఎప్పుడు చేస్తాడో? తెలియ‌దు.

'యానిమ‌ల్' స‌క్స‌స్ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలంతా అతినితో సినిమాలు చేయ‌డానికి క్యూలో ఉన్నారు. ఈనేప‌థ్యంలో సందీప్ హీరో ఎంపిక అన్న‌ది ఇప్పుడు స‌వాల్ తో కూడిన అంశంగానే చెప్పాలి. `అర్జున్ రెడ్డి` త‌ర్వాత టాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌చ్చినా బాలీవుడ్ లో రెండ‌వ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించారు. ఆ క‌థ‌కి తెలుగు హీరో నో చెప్పాడ‌ని అక్క‌డికి వెళ్లాడా? లేక హిందీ హీరో అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని వెళ్ల‌డా? అన్న‌ది తెలియ‌దు. మ‌తృభాష‌ని ప‌క్క‌న‌బెట్టి మ‌రీ యానిమ‌ల్ చేసిన నేప‌థ్యంలో అత‌నిపై కాస్త నెగివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని తొల‌గించుకోవాల్సిన బాధ్య‌త సందీప్ పై ఉంది. మ‌రి ఈ ర‌క‌మైన ప్ర‌చారాల‌కు సందీప్ ఎలాంటి ముగింపు ప‌లుకుతాడు? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News