సిద్దార్ట్ పెళ్లి.. ఆ దేవాలయంలోనే ఎందుకు చేశారు?

ఈ ఆలయంతో వీరి కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధం వల్లే ఈ వివాహం ఇక్కడ జరిగింది.

Update: 2024-09-16 13:39 GMT

హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావు హైదరీ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా వీరు హిందు సాంప్రదాయం ప్రకారం గుడిలో వివాహం చేసుకొని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని చారిత్రక రంగనాథస్వామి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఆలయంతో వీరి కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధం వల్లే ఈ వివాహం ఇక్కడ జరిగింది.

మొదట వీరి ప్రేమకథ 2021లో మహా సముద్రం సినిమా సెట్ లో మొదలైంది. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారడంతో, వారు గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని టాక్. సోషల్ మీడియాలో వీరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన అనంతరం వారి నిశ్చితార్థంపై పెద్ద చర్చ సాగింది. నెల క్రితమే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది.

మొన్ననే ఆ వార్తలపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందించారు. తాము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని ప్రచారం జరుగుతుండగా, సిద్ధార్థ్ ఈ నిశ్చితార్థం రహస్యంగా ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. "సీక్రెట్" మరియు "ప్రైవేట్" మధ్య తేడా ఉందని, తాము పిలవాలనుకున్న వారిని మాత్రమే ఆ వేడుకకు ఆహ్వానించామన్నారు.

ఇక పెళ్లి వేడుకను కూడా ఈ జంట రంగనాథస్వామి ఆలయంలో ప్రైవసీతో ముగించింది. అదితి వనపర్తి రాజు కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి వారసురాలు, ఈ కారణంగా ఈ ఆలయంతో వారి కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. అదితి తండ్రి ఎహసాన్ హైదరీ, ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ పీఎం అక్బర్ హైదరీ మనవడవారవుతారు.

ఈ ఆలయం వారి కుటుంబానికి ఎంతో ముఖ్యమైన స్థలం, ఎందుకంటే వారి కుటుంబానికి సంబంధించిన వివాహాలు అన్ని ఇక్కడే జరిగాయి. ఇప్పుడు సిద్ధార్థ్, అదితి తమ వివాహాన్ని కూడా ఇక్కడే నిర్వహించడం ద్వారా వారసత్వంగా వస్తున్న ఈ సెంటిమెంట్‌ను కొనసాగించారు. ఇలాంటి చారిత్రక, సాంప్రదాయ స్థానంలో పెళ్లి జరగడం కుటుంబానికే కాకుండా అభిమానులకు కూడా ప్రత్యేకంగా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వధూవరులు తమ వివాహం అనంతరం తమ ప్రేమను సోషల్ మీడియాలో ప్రకటిస్తూ, ఫోటోలతో పాటు తమ సంతోషాన్ని పంచుకున్నారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం, చారిత్రక ఆలయ నేపథ్యంలో దిగిన ఫోటోలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ ఇద్దరు కూడా ఎప్పటిలానే వారి సినిమా కెరీర్ ను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News