'డాకు మహారాజ్' ఆ విషయంలో నో రిస్క్
డిసెంబర్‌లో రావాల్సిన ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి విడుదల చేయడం జరుగుతుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. డిసెంబర్‌లో రావాల్సిన ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి విడుదల చేయడం జరుగుతుంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన దర్శకుడు బాబీ ఇటీవల టీజర్ విడుదల చేసి ఒక్కసారిగా ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వడంతో పాటు అందరిలోనూ అంచనాలు మరింత పెంచి ఆహా ఓహో అనిపించాడు.
టీజర్ విడుదల అయినప్పటి నుంచి డాకు మహారాజ్ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అంటూ నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు కొందరు అంటూ ఉంటే మరికొందరు ఈ సినిమాతో బాలయ్య మరో విజయాన్ని సొంతం చేసుకుని డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు. ముందు ముందు సినిమాకు మరింత పబ్లిసిటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2 గంటల 45 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు మూడు గంటలు, అంతకు మించి ఉంటున్నాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నాయి అంటూ కొన్ని సినిమాలకు విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సినిమా విషయంలో అలాంటి టాక్ రాకూడదు అనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా 2 గంటల 45 నిమిషాలు మాత్రమే నిడివిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి మొదటి పాట తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలో బాలయ్యను పవర్ ఫుల్ లుక్‌లో చూపించడంతో పాటు ఆకట్టుకునే విజువల్స్‌ను చూపించడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. వరుసగా మూడు సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించాడు. ఆ మూడు సినిమాలతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాడు. కనుక ఈ సినిమాతో మరోసారి బాలకృష్ణ విజయాన్ని సాధించడం ఖాయం అనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందని, ఆ హీరో పాత్ర సినిమాకు ప్రత్యేకంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2 తో వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.