రెండు సినిమాలతో మొత్తం లాస్.. డిప్రెషన్‌లోకి వెళ్లా!
ఆయన ప్రస్తుతం వందల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నాడు.
ఇండియన్ టాక్ షో లకు, కామెడీ షో లకు ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి కపిల్ శర్మ. ఒక స్టాండ్ అప్ కమెడియన్‌గా, టెలివిజన్ షో హోస్ట్‌గా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, గాయకుడిగా.... ఇలా ఎన్నో రకాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కపిల్ శర్మ ఇండియాలో అత్యధిక సంపాదన కలిగిన టీవీ స్టార్ అనడంలో సందేహం లేదు. ఆయన ప్రస్తుతం వందల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నాడు. కానీ ఒకప్పుడు ఆయన బ్యాంక్ ఖాతాలో చిల్లిగవ్వ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
కింది స్థాయి నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వ్యక్తి కపిల్ శర్మ. ఆయన నటుడిగా, పలు రకాలుగా సంపాదించిన మొత్తంను రెండు సినిమాల నిర్మాణం కోసం వినియోగించడం జరిగిందట. ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పూర్తిగా లాస్ అయ్యి జీరో కి పడి పోయాడు. ఒకానొక సమయంలో బ్యాంక్ ఖాతాలో రూపాయి లేకుండా పోయింది. దాంతో డిప్రెషన్‌కి వెళ్లి పోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. ఒకానొక సమయంలో తన జీవితం అయిపోయిందని భావించిన కపిల్ శర్మకు ఎక్కడో చిన్న హోప్ లభించి ప్రస్తుతం వందల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడు.
ఇండియాలోనే రిచ్చెస్ట్ కమెడియన్గా సైతం కపిల్ శర్మ నిలిచాడు. ఆయన ఒక్క ఎపిసోడ్ చేస్తే పదుల కోట్ల పారితోషికం ఇచ్చేందుకు షో నిర్వాహకులు సిద్ధంగా ఉంటారు. ఓటీటీతో పాటు శాటిలైట్ ఛానల్స్ వారు సైతం చాలా ఆసక్తిగా ఆయన షోలను స్ట్రీమింగ్ చేసేందుకు, టెలికాస్ట్ చేసేందుకు ముందుకు వస్తారు. కపిల్ శర్మ టాక్ షో కి కెరీర్ లో ఒక్కసారి అయినా వెళ్లాలి అని బాలీవుడ్ నుంచి అన్ని వుడ్స్ కి చెందిన స్టార్ హీరోలు హీరోయిన్స్ కోరుకుంటారు. అంతటి క్రేజ్ ఉన్న కపిల్ శర్మ ఆ సమయంలో నిరుత్సాహంతో ప్రయత్నాలు మానేస్తే ఈ సమయంలో ఇలా ఉండేవారు కాదు కదా.. అందుకే ప్రయత్నాలు ఎప్పుడూ మానవద్దు.
కపిల్ శర్మ టాక్ షో కు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. ఇండియన్స్ ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా కచ్చితంగా ఈ టాక్ షో ను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి టాక్ షో లను నిర్వహిస్తున్న కపిల్ శర్మ ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్ట్ లను నిర్మించి లాభాలను సొంతం చేసుకున్నారు. ఆరెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సర్వం కోల్పోయిన కపిల్ శర్మ ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్‌లను చేయడం జరిగింది. కనుక ఓటమి నుంచి లాభాలకు మార్గం సుగమం చేసుకోవచ్చు అంటూ కపిల్ శర్మ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.