శ్రీలీలకు ఉన్న లక్ ఆమెకు ఉందా..?

స్టార్ హీరోయిన్ అయిన కొందరు హీరోయిన్స్ ని చూస్తే వాళ్లు కథల విషయంలో చాలా ఫోకస్ గా ఉంటారు.;

Update: 2025-03-23 00:30 GMT

వరుస సినిమాలు చేస్తూ వెళ్తే చాలు హీరోయిన్ గా సక్సెస్ అవుతామని అనుకుంటారు కొందరు భామలు. కానీ అలా జరగదని వాళ్లకు తెలుసుకునే టైం కి కెరీర్ అటకెక్కేస్తుంది. ఐతే ఖాళీగా ఉండకుండా వచ్చిన ఛాన్స్ చేస్తే ఆడియన్స్ కు టచ్ లో ఉండొచ్చు కదా అనుకునే భామలు అలా చేయడం వల్ల కెరీర్ ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయాన్ని గుర్తించలేరు. స్టార్ హీరోయిన్ అయిన కొందరు హీరోయిన్స్ ని చూస్తే వాళ్లు కథల విషయంలో చాలా ఫోకస్ గా ఉంటారు.

అందుకే వారి కెరీర్ అలా టాప్ లో ఉంటుంది. ఐతే కొంతమంది హీరోయిన్స్ కొన్ని కాంబినేషన్స్ లో చేసినా సరే హిట్ సినిమాలు పడతాయి. అలాంటి సినిమాలను గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ధమాకాతో హిట్టు కొట్టి స్టార్ ఛాన్స్ లు అందుకోగా ఆ తర్వాత ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో పడేసుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ అమ్మడు తిరిగి ఫాంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది.

ఐతే శ్రీలీలకు మొదటి హిట్ ఇచ్చిన ధమాకా డైరెక్టర్ ఈసారి మరో హీరోయిన్ ని పిక్ చేసుకున్నాడు. ఈమధ్యనే మజాకా అంటూ వచ్చిన త్రినాథరావు నెక్స్ట్ సినిమా లైన్లో పెట్టాడు. హవీష్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ ని ఫైనల్ చేశారు. కావ్య కూడా తెలుగులో ఈమధ్య వరుస సినిమాలు చేస్తుంది. పూరీ, రాం కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నా అది నిరాశపరచడంతో అమ్మడి డీలా పడింది.

ధమాకా తో శ్రీలీలకు హిట్ ఇచ్చిన త్రినాథ రావు ఇప్పుడు కావ్య థాపర్ కి ఆ రేంజ్ హిట్ ఇస్తాడా అన్న చర్చ మొదలైంది. త్రినాథరావు సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పటివరకు కావ్య చేసిన సినిమాలన్నీ కూడా ఎక్కువగా గ్లామర్ పాత్రలే అయ్యాయి. అందుకే త్రినాథ రావు సినిమాపై కావ్య కూడా నమ్మకం పెట్టుకుంది.

కావ్య లోని గ్లామర్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే మాత్రం ఆమెకు ఆమె వల్ల సినిమాకు ప్లస్ అయ్యేలా చేయొచ్చు. ఐతే అమ్మడు మాత్రం ఏ ఛాన్స్ వచ్చినా చేస్తుంది కానీ దానికి తగినట్టుగా లక్ మాత్రం ఫేవర్ చేయట్లేదు. మరి త్రినాథ రావు చేస్తున్న ఈ సినిమాతో అయినా కావ్య ఫేట్ మారుతుందేమో చూడాలి.

Tags:    

Similar News