సామ్ ఎన్నాళ్లీ వెయిటింగ్..?

సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

Update: 2025-01-18 10:30 GMT

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య తెలుగు సినిమాలు చేయడం మానేసింది. విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేసిన సమంత ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. బాలీవుడ్ లో ఒక వెబ్ సీరీస్ ని పూర్తి చేసింది. సిటాడెల్ వెబ్ సీరీస్ తో మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించింది. ఐతే సమంత తెలుగు సినిమాల కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మా ఇంటి బంగారం సినిమా ప్రకటించింది కానీ ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయింది. సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

సౌత్ లో సమంతకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆమె కమర్షియల్ సినిమాలతో పాటుగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. ఐతే ఖుషి సినిమాకు ముందు యశోద, శాకుంతలం సినిమాలు చేసినా అవి ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రావాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు. ఐతే విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి తర్వాత పూర్తిగా తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీదే పెట్టింది.

సమంత తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఐతే కమర్షియల్ సినిమా ఆఫర్లు వస్తున్నా కూడా సామ్ ఎందుకో వాటిని కాదనేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా స్టార్ సినిమాలో ఆఫర్లను సమంత వద్దని చెబుతుందట. ఆమధ్య ఓ సినిమా ఈవెంట్ లో త్రివిక్రం కూడా సమంతని తెలుగు సినిమాలు చేయాలని అన్నాడు. ఐతే మీరు రాస్తే మేము చేస్తామని అన్నది సమంత.

సో ఆ లెక్కన చూస్తే సమంత కేవలం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తుందని తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాల్లో చేయాలని అనుకున్నా సరైన ఛాన్స్ రావట్లేదని తెలుస్తుంది. సమంత మళ్లీ ఫోకస్ చేస్తే తెలుగులో కచ్చితంగా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐతే అమ్మడు మాత్రం బాలీవుడ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. సిటాడెల్ తర్వాత మళ్లీ ఆ మేకర్స్ తోనే మరో వెబ్ సీరీస్, సినిమా ఓకే చేసిన సమంత త్వరలోనే ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తో సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. సమంత తిరిగి తెలుగులో వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్నా ఆమెకు నచ్చిన కథలు రావట్లేదని టాక్.

Tags:    

Similar News