దేవర ముందున్నా ధైర్యంగా ముందుకు..?

ఐతే ఈ సినిమా విషయంలో శ్రీ విష్ణు ఇంకా చిత్ర యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Update: 2024-10-03 23:30 GMT

యువ హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ విష్ణు ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు ఈమధ్యనే ఓం భీమ్ బుష్ తో కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమాల తర్వాత ఈసారి శ్వాగ్ అంటూ మరో వెరైటీ కథతో వస్తున్నాడు శ్రీ విష్ణు. రాజ రాజ చోర ఫేం హసిత్ గోలి డైరెక్షన్ లో వస్తున్న శ్వాగ్ సినిమా ఈ వీకెండ్ వస్తుంది. ఐతే ఈ సినిమా విషయంలో శ్రీ విష్ణు ఇంకా చిత్ర యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఐతే ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజై వారమే అవుతుంది. సినిమా టాక్ మిశ్రమంగా వచ్చినా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఐతే దసరా సెలవులు వచ్చాయి కాబట్టి దేవరకు కలిసి వచ్చే అంశమే. ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మేజర్ థియేటర్స్ లో దేవర ఆడుతుంది. మరి శ్రీ విష్ణు శ్వాగ్ దేవర తాకిడికి తట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి. శ్రీవిష్ణు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా సినిమాకు మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

ఎన్టీఆర్ దేవరకు ఆల్రెడీ కలెక్షన్స్ అక్కడక్కడ డ్రాప్ అయ్యాయి. శ్రీ విష్ణు సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంటే సినిమాను ఆపడం కష్టం. ఐతే శ్రీవిష్ణు శ్వాగ్ తో పాటు రాం నగర్ బన్నీ సినిమా వస్తుంది. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా ఆ సినిమా తెరకెక్కింది. వీటితో పాటు ప్రిన్స్, నరేష్ నటించిన కాలి కూడా రిలీజ్ అవుతున్నాయి.

శ్రీ విష్ణు శ్వాగ్ డిఫరెంట్ కథతో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ మోడ్ లో వస్తుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. శ్వాగ్ సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ నటించింది. దేవర కలెక్షన్స్ ఎలాగు కాస్త తగ్గాయి కాబట్టి శ్రీ విష్ణుకి ఇది కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. మరి హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ విష్ణు సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News