ఆ హీరోయిన్ పొలిటికల్ డ్రీమ్ ఉందా..?

దాదాపు తెలుగు, తమిళ్ లో స్టార్స్ అందరితో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది.

Update: 2025-01-06 05:11 GMT

సౌత్ లో రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించిన త్రిష ఇప్పటికీ అదే ఫాం తో దూసుకెళ్తుంది. దాదాపు తెలుగు, తమిళ్ లో స్టార్స్ అందరితో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది. తన మీద ఎన్ని రూమర్స్, ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా త్రిష అదరగొట్టేస్తూ వచ్చింది. స్టార్ హీరోయిన్ గా ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తూ వచ్చిన త్రిష మధ్యలో కొంత గ్రాఫ్ పడిపోయినా కూడా ఇప్పుడు మళ్లీ కెరీర్ సెట్ రైట్ చేసుకుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఆమె పర్ఫెక్ట్ ఆప్షన్ అయ్యింది.


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తుంది అమ్మడు. ఈ సినిమాతో త్రిష చాలా కాలం తర్వాత తెలుగు ఆడియన్స్ ని అలరించనుంది. ఇదిలా ఉంటే త్రిష గురించి ఎక్కువగా వైరల్ అయ్యే వార్తల్లో ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించే. త్రిష రాజకీయాల్లోకి వస్తుందా.. ప్రజా సేవ చేస్తుందా అంటే అవును అనే అంటున్నాయి కోలీవుడ్ మీడియా వర్గాలు. తనకు పాలిటిక్స్ లోకి రావాలని ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని త్రిష చెప్పినట్టుగా ఒక న్యూస్ వైరల్ గా మారింది.

ఐతే ఈమధ్యనే దళపతి విజయ్ సొంత పార్టీ పెట్టాడు. మరోపక్క ఆల్రెడీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. వీటిని దాటుకుని త్రిష సొంత పార్టీ పెడుతుందా పెట్టి సీఎం అయ్యే రేంజ్ కి వెళ్తుందా అన్నది పెద్ద ప్రశ్న. త్రిష పొలిటికల్ ఎంట్రీ పై కోలీవుడ్ లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే విజయ్ పార్టీ పెట్టిన ఈ టైం లో త్రిష ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇంకా సీఎం అవ్వాలని ఉందని చెప్పడంపై కూడా చాలా డౌట్లు రైజ్ అవుతున్నాయి.

ఏది ఏమైనా జయలలిత తర్వాత తమిళనాడుకి మరో మహిళా ముఖ్యమంత్రి ఎవరు అవుతారని జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఐతే త్రిష ఏదో సరదాగా అనుంటుందిలే అనుకునే వారు కొందరైతే లేదు ఆమె టార్గెట్ నిజంగానే సీఎం సీటు అని కొందరు అంటున్నారు. త్రిష పొలిటికల్ డ్రీం పై వస్తున్న ఈ ఊహాగానాలకు ఆమె డైరెక్ట్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆమె సినిమాల మీద ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News