గెలుపు గుర్రమెక్కుతున్న క్వీన్ కంగన
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి ఈ నియోజకవర్గంలో ఎదురే లేదనేది తాజా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్.
మండి లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ లైవ్ ఆసక్తికర వివరాలను వెల్లడించింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి ఈ నియోజకవర్గంలో ఎదురే లేదనేది తాజా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. కాంగ్రెస్ నాయకుడు విక్రమాదిత్య సింగ్‌ను ఓడించబోతోందని 'ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా' అంచనా వేసింది
2024 లోక్‌సభ ఎన్నికల కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఈరోజు (జూన్ 1) ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి, మేటి కథానాయిక కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ విక్రమాదిత్య సింగ్‌ను రంగంలోకి దించింది. కంగనా రనౌత్ తన సొంత ఊరు 'మండి' నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేస్తోంది.
విక్రమాదిత్య సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్ యూనిట్ చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడు. ఫిబ్రవరి చివరలో హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభానికి దారితీసింది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఉద్రిక్తతలను హైలైట్ చేసింది. 2021 లోక్‌సభ ఉప ఎన్నికలో సింగ్ తన తల్లికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ 2024 ప్రకారం.. కంగనా రనౌత్ తన తొలి ఎన్నికల్లో మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందే అవకాశం ఉంది. సొంత నియోజక వర్గంలో పోటీ కంగనకు అన్నివిధాలా కలిసి రానుందని అంచనా.