'కల్కి' పై రోహిత్‌ సేన ఎఫెక్ట్‌...?

లాంగ్‌ రన్‌ లో మరిన్ని రికార్డులను కల్కి సినిమా బ్రేక్ చేయడం ఖాయం అని ఇప్పటికే బాక్సాఫీస్ వర్గాల వారు ఒక అంచనాకు వచ్చారు.

Update: 2024-06-27 11:15 GMT

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కల్కి 2898 ఏడీ సినిమా నేడు విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీగా వైజయంతి మూవీస్ బ్యానర్‌ లో నిర్మాణం జరిగిన కల్కి సినిమాకు ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తో కల్కి స్ట్రాంగ్ గా నిలిచే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. లాంగ్‌ రన్‌ లో మరిన్ని రికార్డులను కల్కి సినిమా బ్రేక్ చేయడం ఖాయం అని ఇప్పటికే బాక్సాఫీస్ వర్గాల వారు ఒక అంచనాకు వచ్చారు.

కల్కి సినిమా కలెక్షన్స్‌ జోరుకు టీం ఇండియా కాస్త స్పీడ్‌ బ్రేకర్‌ గా నిలిచేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేడు ఇంగ్లాండ్‌ తో టీ20 ప్రపంచ కప్‌ లో భాగంగా రోహిత్‌ సేన కీలక మ్యాచ్ ఆడబోతున్న విషయం తెల్సిందే. ఆ మ్యాచ్‌ కి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో కొంత మంది అయినా కల్కి కంటే ముఖ్యంగా ఆ మ్యాచ్‌ చూడాలి అనుకుంటున్నారు.

కల్కి ని తర్వాత రోజు అయినా చూడవచ్చు, మ్యాచ్ ను మాత్రం మిస్‌ చేసుకోవద్దు అని క్రికెట్‌ ఫ్యాన్స్ భావించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌ తో గెలిస్తే ఫైనల్‌ మ్యాచ్ లో రోహిత్‌ సేన ఆటను చూసేందుకు కూడా మళ్లీ క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కు పోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ రోజు కూడా కాస్త కల్కి కలెక్షన్స్ డ్రాప్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

మొత్తంగా ఈ రెండు రోజులు కూడా కల్కి కంటే కూడా రోహిత్‌ సేన ప్రదర్శన వైపు కొంత మంది ప్రేక్షకుల చూపు ఉంటుంది. ఆ తర్వాత వారు మళ్లీ థియేటర్‌ కు వెళ్లి కల్కి చూడటం కన్ఫర్మ్‌. టీ20 వరల్డ్‌ కప్‌ వల్ల కల్కి సినిమాకు ఆ రెండు రోజుల్లో కొంతలో కొంత అయినా డ్యామేజ్ అవుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే హిట్ టాక్ వచ్చింది కనుక మ్యాచ్ లు పూర్తి అయిన తర్వాత ఐనా కల్కిని చూసేందుకు ఆ క్రికెట్‌ ఫ్యాన్స్ కూడా థియేటర్ బాట పడుతారు. కనుక కల్కికి రోహిత్ సేన వల్ల లాంగ్ రన్‌ లో వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అనేది కొందరి అభిప్రాయం.

Tags:    

Similar News