అందాల త్రిష అక్కడా కంబ్యాక్ అవుతోందా?
అంతకు ముందు ఇదే జోడీ స్టాలిన్ లో అలరించిన సంగతి తెలిసిందే.
'పొన్నియన్ సెల్వన్' తర్వాత త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్యమానంగా సాగిపోతుంది. అమ్మడికి కొత్త అవకాశాలు అనూహ్యంగా ఊపందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, విశ్వనటుడు కమల హాసన్ లాంటి సీనియర్ హీరోలతో పనిచేస్తోంది. 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటించే అవకాశం 'విశ్వంభర' ద్వారా సాధ్యమైంది. అంతకు ముందు ఇదే జోడీ స్టాలిన్ లో అలరించిన సంగతి తెలిసిందే.
ఇక కమల్ హాసన్ తో మాత్రం ఇంతవరకూ నటించే అవకాశమే రాలేదు. తొలిసారి 'థగ్ లైఫ్' లో మణిశర్మ ఛాన్స్ ఇవ్వడంతో సాధ్యమైంది. ఇలా తెలుగు, తమిళ్ లో త్రిషకి తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా 14 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణు వర్దన్ దర్శకత్వంలో 'ది బుల్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసినట్లు సమాచారం.
దీంతో 14 ఏళ్ల తర్వాత అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెడుతుంది. 'కట్టామిట్టా' అనే చిత్రంతో అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా త్రిష నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో త్రిషకి హిందీలో అవకాశాలు రాలేదు. కొన్నాళ్ల పాటు ప్రయత్నాలు చేసింది గానీ బాలీవుడ్ దర్శకులు త్రిష వైపు చూడలేదు. దీంతో లాభం లేదనుకున్న త్రిష సౌత్ పైనే దృష్టి పెట్టి పనిచేసింది.
అయితే విష్ణు వర్ధన్ కూడా తమిళ దర్శకుడు అన్నది తెలిసిందే. త్రిషకి ఆ రకంగానే ఛాన్స్ వచ్చిందని కొంత మంది అంటున్నారు. అదే హిందీ డైరెక్టర్ అయితే అతడి ఛాయిస్ మరోలా ఉండేదని వినిపిస్తుంది. ఏది ఏమైనా త్రిషకిది మంచి అవకాశం. సెకెండ్ ఛాన్స్ ఆలస్యమైనా దాన్ని నిలబెట్టుకోవాల్సింది త్రిషనే.