యష్ టాక్సిక్ అప్డేట్.. మళ్ళీ అదే కలరింగ్
మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
'కేజీఎఫ్' సిరీస్ తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలలో నటించారు.
ఇదిలా ఉంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే నిర్మిస్తోంది. మలయాళీలో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న గీతూ మోహన్ దాస్ ఈ 'టాక్సిక్' మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోంది.
ఈ విషయాన్ని రాకింగ్ స్టార్ యష్ ఒక అప్డేట్ ఇచ్చారు. జనవరి 8న 10 గంటల 25 నిమిషాలకి సినిమా నుంచి అప్డేట్ రాబోతోందని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఈ పోస్టర్ లో పాతకాలం నాటు కారు ముందు యష్ క్యాప్ పెట్టుకొని నిలబడి స్టలిష్ గా సిగార్ కాలుస్తూ ఉన్నాడు. ఈ లుక్ చూస్తుంటే 'కేజీఎఫ్' తరహాలోనే ఇందులో కూడా రాకింగ్ స్టార్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది.
రాకింగ్ స్టార్ అభిమానులు ఈ అప్డేట్ ఏంటా అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఉన్నారు. టీజర్ రిలీజ్ అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత యష్ కొత్త సినిమాకి సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో యష్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఆమెకిదే మొదటి కన్నడ సినిమా కావడం విశేషం. ఇక హ్యూమా ఖురేషి ఈ చిత్రంలో యష్ అక్కగా కనిపించబోతోందంట. సిస్టర్ సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ గా ఉండబోతోందని అనుకుంటున్నారు. 'కేజీఎఫ్ 2' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యష్ చేస్తోన్న మూవీ కావడం ఈ 'టాక్సిక్' అప్డేట్ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మరి ఈ అప్డేట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.