84 ఏళ్ల వయసులోనూ తండ్రి మాట కోసం...!

అందుకే నాతో చిన్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్లవద్దని సూచించాడు. నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వెళ్లలేదు అన్నారు.

Update: 2024-01-12 06:54 GMT

8 జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషన్‌, పద్మ విభూషన్ బిరుదులు పొందిన అద్భుత గాయకుడు, గాన సరస్వతి ఏసుదాసు 84వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయాల వైపు తొంగి చూసింది లేదు. పలు రాజకీయ పార్టీల నుంచి అత్యున్నత గౌరవం లభించింది.


జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో పొలిటికల్‌ ఆఫర్లను దక్కించుకున్న ఏసుదాసు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. అందుకు కారణం ఆయన తన తండ్రికి చిన్నతనంలో ఇచ్చిన మాట కారణంగా తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

తన తండ్రికి రాజకీయాలపై సరైన ఉద్దేశ్యం లేదు. రాజకీయాల్లోకి వెళ్లడం కి ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండే వారు. అందుకే నాతో చిన్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్లవద్దని సూచించాడు. నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వెళ్లలేదు అన్నారు.

ఇక ముందు కూడా తాను రాజకీయాల వైపు చూసేది లేదు అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఏసుదాసు ఓకే అనాలే కానీ ఆయనకు రాజ్యసభ స్థానం కల్పించేందుకు ఎన్నో రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన తండ్రి మాట కోసం 84 ఏళ్ల వయసులోనూ కట్టుబడి ఉన్నారు.

ఆయన పాటలు కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్‌ ఇండియాలో కూడా చాలా ఫేమస్‌. ఇండియన్ సినిమా బతికి ఉన్నంత కాలం ఏసుదాసు పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన యొక్క భక్తి పాటలు ఎవర్‌ గ్రీన్ గా నిలిచాయి అనే విషయం కూడా తెల్సిందే.

Tags:    

Similar News