యోధ టీజర్: గాల్లో తేలే ప్రాణాలు గాల్లోనే!

రోహిత్ శెట్టి ఇండియ‌న్ పోలీస్ ఫోర్స్ లో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు కురిసాయి

Update: 2024-02-19 14:24 GMT

రోహిత్ శెట్టి ఇండియ‌న్ పోలీస్ ఫోర్స్ లో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు కురిసాయి. ఇప్పుడు అత‌డు నటించిన యోధా టీజర్ విడుదలైంది. చాలా కాలం తర్వాత మేకర్స్ ఎట్టకేలకు ఒక‌ వీడియోను షేర్ చేయ‌డంతో దీనిపై కొంత వివ‌రం దొరికింది. ఈ టీజ‌ర్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. ధ‌ర్మా బ్యాన‌ర్ అధినేత కరణ్ జోహార్ అభిమానులలో ఉత్సాహం స్థాయిని కొనసాగించడానికి కొత్త పోస్టర్‌లను నింపిన టీజ‌ర్ ఇది. ఈ చిత్రంలో దిశా పటానీ -రాశి ఖన్నా కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఎయిర్ రెస్క్యూ నేప‌థ్యంలోని ఒక రకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ప్రచారం సాగింది. ఇప్పుడు టీజ‌ర్ తో దీనిపై స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది.

రన్‌వేను చూపించే సన్నివేశంతో టీజర్‌ను తెరకెక్కించారు. ఒక విమానం హైజాక్ కి గుర‌వుతుంది. సమాచారం వైమానిక‌ కార్యాలయాలకు చేరుకుంటుంది. రాశి ఖన్నా సన్నివేశంలో కనిపించింది. హైజాక్ వార్త తెలుసుకుని షాక్ అవుతుంది. తదుపరి సన్నివేశంలో కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న సిద్ధార్థ్‌ని పరిచయం చేసి, ప్రయాణికులను రక్షించే ఆప‌రేష‌న్ చేప‌డ‌తారు. ఇది యాక్ష‌న్ ప్యాక్డ్ కంటెంట్ తో పాటు, థ్రిల్స్ కి గురి చేసే స‌న్నివేశాల‌తో తెర‌కెక్కింద‌ని అర్థ‌మ‌వుతోంది. గత వారం 13,000 అడుగుల ఎత్తులో మొట్టమొదటి హిందీ సినిమా పోస్టర్ లాంచ్ కావడం ద్వారా యోధ ఇప్పటికే చరిత్ర సృష్టించిందని చిత్ర నిర్మాత‌ కరణ్ వెల్లడించారు. అత‌డు షేర్ చేసిన వీడియోలో పోస్టర్‌ను ఆవిష్కరించడానికి చిత్ర‌బృందం దుబాయ్‌లో స్కైడైవింగ్‌కు వెళుతూ క‌నిపించారు.

ఈ చిత్రం గురించి కరణ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ''యోధ వంటి ప్రత్యేక చిత్రం చారిత్రాత్మకమైన మూవ్ మెంట్ కి అర్హమైనది. ఇది వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం... అదే సమయంలో మొత్తం డ్రామా థ్రిల్స్ తో ర‌క్తి క‌ట్టిస్తుంది. యాక్షన్ హీరోగా సిద్ పర్ఫెక్ట్ గా ఇమిడిపోయాడు. యోధాతో అతడు భారతదేశంలో స‌రైన‌ యాక్షన్ హీరోగా పూర్తి స్థాయికి చేరుకున్నాడు... అని పొగిడేశారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుండి షేర్షా వరకు ఇప్పుడు యోధా వరకు నేను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో ప‌ని చేసాన‌ని సిద్ధార్థ్ మ‌ల్హోత్రా వెల్ల‌డించారు. మేము పనిచేసిన ప్రతి సినిమా క్లాస్ తో పాటు మాస్‌లోనూ ప్రతిధ్వనించింది. యోధ నిస్సందేహంగా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని సిద్ధార్థ్ అన్నారు. యోధ మార్చి 15న విడుదల కానుంది.

Full View
Tags:    

Similar News