ఆ యంగ్ హీరో శరీరంలో భారీ మార్పులు!
సాధారణంగా హీరో అంటే స్లిమ్ లుక్ మెయింటెన్ చేస్తారు. ఇది ఓ కండీషన్ లాంటింది. సెలబ్రిటీలంటే ఫిట్ నెస్ తప్పనిసరి
సాధారణంగా హీరో అంటే స్లిమ్ లుక్ మెయింటెన్ చేస్తారు. ఇది ఓ కండీషన్ లాంటింది. సెలబ్రిటీలంటే ఫిట్ నెస్ తప్పనిసరి. ఇక్కడ పోటీ లో రాణించాలంటే? లుక్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ తప్పక తీసుకోవాలి. రెగ్యులర్ గా జిమ్..యోగా..డైట్ వంటివి పాటించాలి. శరీరంలో ఏమాత్రం మార్పులు రాకుండా జాగ్రత్త పడాలి. అలా కుదరనప్పుడు ఒకవేళ బరువు పెరిగినా అది ఓవర్ వెయిట్ కాకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ పెరగాల్సి వచ్చినా పాత్ర డిమాండ్ చేసినప్పుడు తప్పదు.
ఆ తర్వాత మళ్లీ వీలైనంత త్వరగా స్లిమ్ లుక్ లోకి మారిపోతారు. తాజాగా టాలీవుడ్ లో ఇప్పుడో యంగ్ హీరో శరీరంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. స్లిమ్ గా ఉండే ఆహీరో లుక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అధిక బరువు పెరిగినట్లు తెలుస్తుంది. ముఖం నుంచి కాలి పాదం వరకూ ప్రతీ భాగంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శరరీంలో కొవ్వు ఎక్కువగా ఫామ్ అయినట్లు కనిపిస్తుంది. ముఖ రూపం పూర్తిగా మారిపోయింది. మాములుగానే ఆ హీరో ముఖం చిన్నగా ఉంటుంది.
ఇప్పుడా ముఖం రెండింతలు అయినట్లు కనిపిస్తుంది. అలాగే శరీరంలో ఉదర..పొట్ట భాగాలు బాగా ముందుకొ చ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా నెట్టింట లీకైన ఫోటోలు చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. అతను ఇంతలా మారిపోయాడేంటి? అనక మానరు. ఏదైనా పాత్ర కోసం అలా మారుతున్నాడా? అలాంటి భారీ స్పాన్ ఉన్న కథలు విన్నట్లు లేదు. తాజా లైనప్ లో కూడా అలాంటి సినిమాలేవి కనిపించలేదు. అయితే ఈ మధ్యనే రిలీజ్ అయిన రెండు చిత్రాల్లోనూ కాస్త బరువు పెరిగినట్లు కనిపించాడు.
వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని మార్పులు కారణంగా అలా పెరగాల్సి వచ్చిందని వినిపించింది. అయితే ఇప్పుడా వెయిట్ రెట్టింపు అయిన విధానం చూస్తేనే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. వెయిట్ పెంచి పోషించే పాత్రలు లేకపోవడం.. ఓవర్ వెయిట్ గా ఫోకస్ అవ్వడంతో బరువు తగ్గాలంటూ కొన్ని సూచనలు జారీ అవుతున్నాయి. అధిక బరువు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అన్న విషయాన్ని నెటి జనులు గుర్తు చేస్తున్నారు.