ట్రెండీ టాక్: యాక్షన్ బాటలో యువహీరోలు
యాక్షన్-ప్యాక్డ్ అరంగేట్రంతో ప్రేక్షకుల్ని అబ్బురపరచడానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు స్టార్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల యాక్షన్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. రణబీర్ కపూర్ - యానిమల్, షారూఖ్ - పఠాన్, జవాన్ చిత్రాలు భారీ యాక్షన్ కంటెంట్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తెలుగు నుంచి ఆర్.ఆర్.ఆర్, పుష్ప లాంటి చిత్రాలు యాక్షన్ కథాంశాలతో రక్తి కట్టించినవే.
అదంతా అటుంచితే బాలీవుడ్ లో ఐదుగురు యంగ్ హీరోలు ఇప్పుడు భారీ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇందులో కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, పావైల్ గులాటీ, రాఘవ్ జుయెల్, సిద్ధాంత్ చతుర్వేది సహా పలువురు ఉన్నారు. యాక్షన్ జానర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నందున యంగ్ హీరోలు అలాంటి కంటెంట్ తో తమదైన ముద్ర వేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. తాము నటిస్తున్న తదుపరి చిత్రాలతో ఆడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్-ప్యాక్డ్ స్టోరీలతో భావోద్వేగాలు నిండిన కంటెంట్ తో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. యాక్షన్-ప్యాక్డ్ అరంగేట్రంతో ప్రేక్షకుల్ని అబ్బురపరచడానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు స్టార్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పావైల్ గులాటి - దేవా
డ్రామా నేపథ్య చిత్రాల్లో అద్భుతమైన నటనతో పాపులరైన పావైల్ గులాటి `దేవా`తో యాక్షన్ జోనర్‌లోకి దూసుకుపోతున్నాడు. అతడు భయంకరమైన కనికరంలేని నరకాసురుడిగా కనిపించబోతున్నాడు. యాక్షన్ స్టార్ గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి ఆస్కారం ఉందనేది టాక్. పాపులర్ ఫిలింమేకర్ రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవా ముంబైలోని భయంకరమైన అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా. గ్రిప్పింగ్ కథనంతో భారీతనంతో రక్తి కట్టించనుంది. పావైల్ భారీ యాక్షన్ హీరోగా మారుతుండడంతో అతడిపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అభిమానులు అతడిని హై ఆక్టేన్ యాక్షన్ దృశ్యాలలో చూడటానికి ఆసక్తిగా ఉన్నారు.
రాఘవ్ జుయల్ - కిల్
రాఘవ్ జుయాల్.. తనవైన ప్రత్యేక నృత్య కదలికలు.. అద్భుత కామెడీ టైమింగ్‌తో అలరించే నటుడు. KILL చిత్రంతో యాక్షన్ క్రైమ్ జానర్‌లో ప్రవేశిస్తున్నాడు. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాఘవ్ నుండి విభిన్నమైన నటనను కోరుకునే హై-ఆక్టేన్ థ్రిల్లర్. ఇది ఒక గూండారాజ్ కథాంశంతో రూపొందింది. రాఘవ్ నిజానికి డ్యాన్సింగ్ స్టార్‌గా పాపులరయ్యాడు. కానీ అతడు డ్యాన్స్ ఫ్లోర్‌ల నుండి యాక్షన్ సన్నివేశాలకు మారడం థ్రిల్లింగ్ జర్నీగా చూడాలి. అతడిలోని చురుకుదనం, డైనమిక్ ఎనర్జీ అదనపు బలాలతో KILL లో రాఘవ్‌ని వైవిధ్యంగా చూడగలమని అభిమానులు భావిస్తున్నారు.
సిద్ధాంత్ చతుర్వేది - యుధ్ర
గల్లీ బాయ్‌లో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధాంత్ చతుర్వేది ఇప్పుడు `యుధ్ర` చిత్రంతో యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నాడు. రవి ఉద్యవార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించనుంది. ఇది సిద్ధాంత్‌ని రియల్ యాక్షన్ హీరోగా ఆవిష్కరించనుంది. యుద్ధ కళలు..వినూత్న విన్యాసాలను మిళితం చేసి, శక్తివంతమైన ప్రత్యర్థికి వ్యతిరేకంగా యువకుడి పోరాటం చుట్టూ తిరిగే కథాంశంతో రక్తి కట్టించనుంది. సిద్ధాంత్ చరిష్మా పాత్ర కోసం అంకితభావం.. అద్భుత ప్రదర్శన తన కెరీర్‌లో యుధ్రా ఒక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
వరుణ్ ధావన్ - బేబీ జాన్
బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమాతో యాక్షన్ జానర్ ని టచ్ చేస్తున్నారు.ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ థ్రిల్లర్‌లకు పేరుగాంచిన కాలీస్ దర్శకత్వం వహించిన `బేబీ జాన్` వరుణ్ నటనా నైపుణ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళుతుందని అంచనా. ఈ చిత్రం క్రైమ్, గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కుతోంది. అండర్ కవర్ ఏజెంట్‌గా వరుణ్ నటిస్తున్నారు. అత్యంత కఠినమైన, ముడి యాక్షన్ తో రూపొందుతున్న డ్రామా చిత్రమిదని పుకారు ఉంది. అతడి మునుపటి పాత్రలతో పోలిస్తే యాక్షన్ స్టార్ గా మరో లెవల్ ని చూపించబోతున్నాడు. అయితే `బేబీ జాన్` కళా ప్రక్రియలో తన మొదటి పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమని వరుణ్ ధావన్ ఇంతకుముందు వెల్లడించాడు.
కార్తీక్ ఆర్యన్ - విశాల్ భరద్వాజ్ ప్రాజెక్ట్
రొమాంటిక్ కామెడీలకు ప్రసిద్ధి చెందిన కార్తీక్ ఆర్యన్ ఇంకా టైటిల్ నిర్ణయించని యాక్షన్ చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో జతకట్టనున్నారు. ఘాడమైన కథ, కంటెంట్, లేయర్డ్ కథనాలతో సినిమాలు రూపొందించడంలో భరద్వాజ్ నైపుణ్యం .. యాక్షన్ స్టార్ గా నిరూపించుకోవాలన్న అర్యన్ కి ప్లస్ కానున్నాయి.
ఈ చిత్రం ఆర్యన్‌ని కొత్తగా కఠినమైన అవతార్‌లో ప్రదర్శిస్తుంది. హైఎనర్జీతో కూడిన యాక్షన్ సన్నివేశాలతో భరద్వాజ్ మార్క్ కథనాన్ని మిళితం చేయాలని భావిస్తున్నారు. భారీ యాక్షన్ తో నాటకీయ మలుపులతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది.