ఫెయిల్యూర్ కి ఆ యంగ్ హీరో ఓ ఎగ్జాంపుల్!

ఇదే అదునుగా చూసుకుని స‌ద‌రు ద‌ర్శ‌క-నిర్మాత‌లు ఎటాకింగ్ దిగారు. కొత్త అవ‌కాశాలి వ్వ‌డానికి ఒక్క‌సారిగా వెన‌క‌డుగు వేసారు.

Update: 2023-10-24 00:30 GMT

ఇండ‌స్ట్రీలో క్ర‌మ‌శిక్ష‌ణ అనేది చాలా ముఖ్య‌మంటారు. ఎంత ఎదిగినా ఓదిగే ఉండే ల‌క్ష‌ణం అల‌వార్చుకో వాలంటారు. న‌టుడిగా స‌క్సెస్ తీరానికి చేర్చేది అదొక్క‌టేన‌ని అనుభ‌వ‌జ్ఞులు చెబుతుంటారు. అ ల‌క్ష‌ణాలు లేని న‌టుడు ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం ఉండ‌లేడ‌ని వార్న్ చేస్తుంటారు. నిజ‌మే అందుకు ఓ యంగ్ హీరోనే ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. టాలీవుడ్ కి ఆ కుర్రాడు ఉవ్వెత్తున దూసుకొచ్చాడు. తొలి సినిమా గ్రాండ్ స‌క్సెస్... అటుపై రిలీజ్ చేసిన మ‌రో సినిమా సోలో హీరోగా నిల‌బెట్టింది.

కుర్రాడిలో ఎన‌ర్జీ..ఛామ్ అన్ని హీరో గా ప‌రిశ్ర‌మ‌కి పనికొచ్చేవాడ‌ని ఓ స్టాంప్ కూడా ప‌డింది. అటుపై వ‌రుస అవ‌కాశాల‌తో చాలా సినిమాలు చేసాడు. అయితే ఇలా అవ‌కాశాలు అత‌ని తీరులో మార్పులు తీసుకొచ్చా యి. క్ర‌మ‌శిక్ష‌ణ కొర‌వ‌డింది. నేను పెద్ద స్టార్ ని అయిపోయాను అన్న గ‌ర్వ‌ధోర‌ణి అత‌నిలో క‌నిపించింది. దీంతో నిర్మాత‌ల‌కు తిప్ప‌లు త‌ప్ప‌లేదు. స‌మ‌యానికి షూటింగ్ కి వెళ్ల‌క‌పోవ‌డం..డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేయ‌క‌పోవ‌డం...అవ‌న‌స‌ర‌పు అద‌న‌పు ఖ‌ర్చులు మోప‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్పాడిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

అయినా కొన్నాళ్ల పాటు ఆ యంగ్ హీరోని ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు భరించారు. ఈక్ర‌మంలో కొన్ని ప్లాప్ లు ఎదుర‌య్యాయి. ఇదే అదునుగా చూసుకుని స‌ద‌రు ద‌ర్శ‌క-నిర్మాత‌లు ఎటాకింగ్ దిగారు. కొత్త అవ‌కాశాలి వ్వ‌డానికి ఒక్క‌సారిగా వెన‌క‌డుగు వేసారు. త‌న‌ని మంచి న‌టుడు..గొప్ప న‌టుడు అని పొగిడిన వారే త‌న ప్ర‌వ‌ర్త‌న ఎత్తి చూపి అవ‌కాశం లేద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పిన వారు ఉన్నారు.

కేవలం అత‌ని యాటిట్యూడ్..ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగానే అవ‌కాశాలు ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని ప‌బ్లిక్ గానూ చెప్పిన సంద‌ర్భాలున్నాయి. ఇదే ఆ యంగ్ హీరో కెరీర్ కి ముగింపు గా మారింది. ఇప్పుడు క‌నీసం టీవీ సిరియ‌ల్స్ లో కూడా అవ‌కాశం రావ‌డం లేదు. అప్పుడ‌ప్పుడు టీవీల్లో ఏదో షోలో క‌నిపించ‌డం త‌ప్ప‌! చేసేదేం లేద‌ని తేలిపోయింది. ఆ యంగ్ హీరోతో పాటు ఎంట్రీ ఇచ్చిన మ‌రో న‌టుడు బిజీ స్టార్ గా మాట్లాడాడు. డే వ‌న్ నుంచి అత‌నిలో డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ చాలా మందిని ఆక‌ర్షించింది.

అత‌నిలో క‌ష్ట‌ప‌డే త‌త్వం చూసి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఆ ఫెయిల్యూర్ యంగ్ హీరో జీవితం అలాంటి ఆలోచ‌న‌లు ఉన్న న‌టుల‌కు ఓ గుణ‌పాఠంలా మారింది. ఇండ‌స్ట్రీలో ఎలా ఉండాలి? ఎలా ఉండ‌కూడ‌దు అన‌డానికి ఆ యంగ్ హీరోలిద్ద‌ర్ని పోల్చి చూసుకుంటే స‌రి. స‌క్సెస్ సీక్రెట్ ఏంటి? అన్న‌ది తెలిసిపోతుంది.

Tags:    

Similar News