భార్య, భర్తల మధ్యలో ఎఫైర్స్ చిచ్చు!
కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ భార్య శ్రీదేవి బైర్పతో విడిపోయాడానికి రెడీ అయ్యాడు.
కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ భార్య శ్రీదేవి బైర్పతో విడిపోయాడానికి రెడీ అయ్యాడు. జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేసాడు. భార్య క్రూరంగా హింసిస్తుందటూ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణల్ని శ్రీదేవి ఖండించి కౌంటర్ గా యువ రాజ్ కుమార్ పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి యువరాజ్ తరుపు న్యాయవాది ప్రెస్ మీట్ లో సంచలన ఆరోపణలు చేసారు.
శ్రీదేవికి మరోకరితో అక్రమ సంబంధం ఉందని, భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించిందని, ఇంటిపేరు దుర్వినియోగం చేసిందన్నారు. వివాహమైన ఓ వ్యక్తితోనే అక్రమ సంబంధం పెట్టుకుంని ఆరోపించారు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు తిరిగి యువరాజ్ కే అక్రమ సంబంధం ఉందని తప్పుడు మాటలు మాట్లాడుతుందన్నారు. యువరాజ్ కి లైంగిక సమస్య ఉందని శ్రీదేవి లీగల్ నోటీసులో పేర్కొంది. అలాంటప్పుడు యువరాజ్ కి అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు.
ఇక శ్రీదేవి బైరప్ప వెర్షన్ లో కి వెళ్తే.. ` ఒక మహిళను తక్కువ చేసి సమాజంలో మాట్లాడటం దుర దృష్టకరం. కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డా. కుటుంబ గౌరవం కాపాడేందుకు మౌనంగా ఉన్నాను. కానీ నా మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధగా ఉంది. యువ రాజ్ కి ఓ నటితో అక్రమ సంబంధం ఉంది. నిజం, న్యాయం తప్పకుండా నెగ్గుతున్నాయని నమ్ముతున్నాను` అని శ్రీదేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ వివాదం నెట్టింట హిట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీ కుటుంబం ఏకంగా మీడియా ముందు కొచ్చి రచ్చ చేయడంతో సంచలనంగా మారింది. మీడియా అంతటా ఇదే చర్చగా మారింది. యువరాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే సుపరిచితుడు. యువ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి మైసూర్ కి చెందిన శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి తొలుత యువ రాజ్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ దివంతగ నటుడు పునిత్ రాజ్ కుమార్ జోక్యంతో కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడా బంధం విచ్చిన్నం దిశగా అడుగులు వేస్తోంది.