మనవరాలి ఎంట్రీపై ఆశాభోంస్లే ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ గాయని ఆశాభోంస్లే మనవరాలు జనై భోంస్లే 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే
ప్రముఖ గాయని ఆశాభోంస్లే మనవరాలు జనై భోంస్లే 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శివాజీ భార్య రాణి సాయి భోంసాలే పాత్రలో నటిస్తోంది. దీంతో జనై భోంస్లేకి సినిమాలో కీలక బాధ్యతలే అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రకటనతోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఛత్రపతిపై ఇప్పటికే కొన్ని సినిమాలు తెరకెక్కినా? పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేదు.
అయితే తాజా సినిమాలో శివాజీ చరిత్ర మొత్తాన్ని చెప్పబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం ద్వారా సందీప్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇమ్మెర్సో స్టూడియో- లెజెండ్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ...మనవరాలి పాత్ర గురించి ఆశాభోంస్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'ఓ గొప్ప ప్రాజెక్ట్ లో నా మనవరాలు భాగం కావడం సంతోషంగా ఉంది.
ఇలాంటి సినిమాల్లో నటించాలంటే అదృష్టం ఉండాలి. ఆ అవకాశం నా మనవరాలికి రావడం తన అదృ ష్టమనే అంటాను. సందీప్ కూడా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అందరికీ ఈ సినిమా మంచి పేరు..గుర్తింపును తీసుకురావాల'న్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబ వంశానికి చెందిన వారసుడు. చాలా తెలివైన నిష్ణాతులైన కుటుంబంతో తన వంశాన్ని పంచుకున్న జనైని పరిచయం చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.
దివంగత లతా మంగేష్కర్జీ ఆమె అత్త ఆశా భోంసలేజీ మనవరాలు. రాణి సాయి బాయి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుంది అని దర్శకుడు సంతోషం వ్యక్తం చేసారు. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 19- 2026 లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఈ సినిమా చిత్రీకరణ..ఇతర పనులు పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఛత్రపతి కథను పూర్తి స్థాయిలో చెప్పే సాహసం చేయడంతో సమయం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.