ఏడాదైనా ఏంటి భయ్యా ఈ బజ్‌

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా థియేట్రికల్‌ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.

Update: 2024-05-14 10:03 GMT

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా థియేట్రికల్‌ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఏదో ఒక సినిమా, సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొన్ని మాత్రమే 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అంతకు మించి ఆలస్యం చేస్తే బజ్ పోతుంది.

ఓటీటీ బిజినెస్ థియేట్రికల్‌ బిజినెస్ కంటే ముందే పూర్తి అవుతుంది. కనుక ఫలితం ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. నిర్మాతలకు ఓటీటీ బిజినెస్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. థియేట్రికల్‌ రిలీజ్ తర్వాత ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానంతో ముందుగానే ఓటీటీ బిజినెస్ పూర్తి చేస్తున్నారు.

అన్ని సినిమాల మాదిరిగానే గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జర హట్కే జర బచ్కే' సినిమా కూడా థియేట్రికల్‌ రిలీజ్ కంటే ముందే ఓటీటీ బిజినెస్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డీల్ క్యాన్సిల్‌ అయ్యి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వలేదు.

సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి, దాదాపుగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసింది. దాంతో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పటి వరకు కూడా ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ మూవీ ని ఈ వారంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఏడాది తర్వాత కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ సినిమాకు మంచి బజ్ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Tags:    

Similar News