దక్షిణాసియా దేశాలు డేంజర్‌లో ఉన్నాయా..? దానికి కారణం అదేనా..?
కంటికి కనిపించని సూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పారాసైట్లు, ఫంగస్ వంటివి మనిషి శరీరం లోపల, బయట ఉంటాయి.
కంటికి కనిపించని సూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పారాసైట్లు, ఫంగస్ వంటివి మనిషి శరీరం లోపల, బయట ఉంటాయి. వీటినే మైక్రోబ్స్ అని కూడా పిలుస్తుంటారు. మనిషి నిత్య జీవితంలో ఇవి కూడా ఒక భాగమనే చెప్పాలి. వైద్యానికి లొంగని సూపర్ బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) వల్ల గత 31 ఏళ్లలో 10 లక్షల మంది చనిపోయారని ఓ గ్లోబల్ సర్వేలో వెల్లడించింది.
రాబోయే 25 ఏళ్లలో కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల 3.9 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ప్రమాదం ముఖ్యంగా ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తోపాటు తదితర దేశాలకు పొంచి ఉన్నట్లు చెప్పింది. దక్షిణాసియా దేశాల్లోనూ సుమారుగా 1.18 కోట్ల మంది చనిపోతారని అంచనా వేస్తూ హెచ్చరించింది.
యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది. 2019లో 1.27 మిలియన్ల ప్రపంచ మరణాలకు బ్యాక్టీరియానే కారణమైంది. 4.95 మిలియన్ల మరణాలకు దోహదం చేసిందని అంచనా వేశారు. AMR అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ యాంటీ బర్గ్స్ మేలు చేయడమే కాకుండా.. చాలా సందర్భాల్లో కీడు చేస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులతోపాటు జంతువుల, మొక్కలకూ హానీ చేస్తాయని వివరించారు. ఇవి మైక్రోబ్స్‌ను అంతం చేయడం లేదా వ్యాప్తి తగ్గించడం చేస్తుంటాయి. అప్పుడు టీకాలు వేసుకున్నా.. ఔషధాలు వాడినా పెద్దగా ఫలితం ఉండదని హెచ్చరిస్తున్నారు.