మీరు యాపిల్ తింటున్నారా అయితే కచ్చితంగా ఇది తెలుసుకోవాలి..

రోజుకు ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అని మనకు చాలామంది చెబుతారు

Update: 2024-07-15 09:30 GMT

రోజుకు ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అని మనకు చాలామంది చెబుతారు. హెల్దిగా ఉండడం కోసం మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి అని ఎవరు చెప్పినా ఫస్ట్ మనకు గుర్తుకు వచ్చేది యాపిల్. అయితే ఈ యాపిల్ తినడం వల్ల మన శరీరంలోకి కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా వెళ్తుంది అన్న విషయం మీకు తెలుసా..

ఎర్రగా.. గుండ్రంగా.. చూడగానే తినాలి అనిపించేలా ఉండే ఫ్రూట్ యాపిల్. పైగా యాపిల్ రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు చెబుతారు. అందుకే రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని కూడా అంటారు. అలాంటి యాపిల్స్ తినడం వల్ల మన శరీరంలోకి కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా వెళ్తుందట. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. మరి ఆ బ్యాక్టీరియా ఏమిటి.. ఇంతకీ దానివల్ల మనకు మంచి జరుగుతుందా? లేదా? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి..

యాపిల్ చాలా మంచిది. అందులో డౌట్ లేదు. ఇందులో పుష్కలంగా విటమిన్ లతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. మన శరీరంలో ఉన్న విష పదార్థాలను, మలినాలను బయటకు పంపించడానికి యాపిల్ ఎంతో సహాయపడుతుంది.యాపిల్స్‌లో ఫైబర్ కంటెంట్ తో పాటు ఫ్లేవనాయిడ్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటన్నిటితో పాటుగా యాపిల్స్ లో కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మనం యాపిల్స్ తిన్నప్పుడు ఈ బ్యాక్టీరియా నేరుగా వెళ్లి మన పొట్టలో తిష్ట వేస్తుంది.

240గ్రాముల బరువున్న యాపిల్ తినేటప్పుడు సుమారుగా 10 కోట్ల వరకు బ్యాక్టీరియా మన పొట్టలోకి వెళ్తుంది అంటున్నారు పరిశోధకులు. అయితే వీటిలో లభించే బ్యాక్టీరియా ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయం దాన్ని పండించే చోటును బట్టి ,ఉపయోగించే క్రిమి కీటకాలను బట్టి ఉంటుందట.ఆస్ట్రియాలోని గ్రాజ్

యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ లో నిర్వహించిన పరిశోధనలలో ఈ విషయం బయటపడింది. యాపిల్ లోని కాడ, గుజ్జు ,విత్తనాలు, తొక్క.. ఇలా ప్రతి భాగంలో బ్యాక్టీరియా ఉంటుంది. కానీ సేంద్రియ పద్ధతిలో పండించిన రకాలు తినడం మంచిది అంటున్నారు పరిశోధకులు.

బ్యాక్టీరియాకు దీనికి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. సేంద్రియ పద్ధతిలో పండించిన వాటికి బ్యాక్టీరియా సంఖ్యలో మార్పు ఉండనప్పటికీ.. లోపల ఉన్న బ్యాక్టీరియాలో మాత్రం తేడా ఉంటుందట. సేంద్రీయ పద్ధతిలో పండించిన యాపిల్స్ లో మైక్రోబయోమ్ల కంపోజిషన్ మారిపోతుందట. కాబట్టి ఇది మనకు మేలు చేస్తాయి. అందుకే ఎర్రగా ఉన్నాయి ,మచ్చలు లేకుండా ఉన్నాయి అని మోసపోయి కెమికల్స్ వాడి పండించిన యాపిల్స్ ని తీసుకోకండి. ఆర్గానిక్ పద్ధతితో ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించిన పండ్లు తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

Tags:    

Similar News