థైరాయిడ్ తో బాధపడుతున్నారా ?

థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు గొంత దగ్గర వాపు మొదలై అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి.

Update: 2024-06-01 11:30 GMT

ప్రస్తుత కాలంలో థైరాయిడ్ వ్యాధి బారినపడడం సహజంగా మారింది. కానీ థైరాయిడ్ ను గుర్తించడంలో ఆలస్యం అవుతుంది. థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు గొంత దగ్గర వాపు మొదలై అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. మెడ కింది భాగంలో ఉండే గ్రంధిని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఇది థైరాక్సిన్, ట్రైఅయోడోథైరోనిన్ అనే రెండు ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరం, పనితీరుకు చాలా అవసరం.

థైరాయిడ్ గ్రంథి తక్కువ పరిమాణంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపోథైరాయిడిజం అని, థైరాయిడ్ గ్రంధి అధిక మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అని అంటారు. మనం తీసుకునే ఆహారం మూలంగా ఈ రెండింటిని సమపాళ్లలో ఉంటాయి. థైరాయిడ్ రావడం కన్నా ముండే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

థైరాయిడ్ రాకూడదంటే పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు తినాలి. ప్రోటీన్ కోసం, చేపలు లేదా బీన్స్ వంటి తక్కువ కొవ్వు ఉన్నవాటిని ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వంటలో ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాలి. చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వులు చాలా మేలు చేస్తాయి. వీటితోపాటు విత్తనాలు, గింజలు, చిక్కుళ్లు తీసుకోవాలి. ఇవి జీర్ణక్రియను సరిగ్గా ఉండేలా చూస్తాయి. కూరగాయలు, పండ్లు తినడం ద్వారా మీరు తగినంత మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. అయోడిన్ అధికంగా ఉన్న ఆహారం థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను దెబ్బతీస్తుంది. అందుకే ఉప్పును పరిమితంగా తీసుకోవాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే థైరాయిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Tags:    

Similar News