తరచూ దగ్గు వస్తుందా.. అయితే మీ గుండె జర జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు…

దగ్గు అనేది సర్వసాధారణ సమస్య. క్లైమేట్ మారిన ప్రతిసారి మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు

Update: 2024-07-18 16:30 GMT

దగ్గు అనేది సర్వసాధారణ సమస్య. క్లైమేట్ మారిన ప్రతిసారి మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే తరచూ దగ్గు రావడం మీ గుండె ఆరోగ్యానికి అలారమ్ లాంటిది అని మీకు తెలుసా?

ఊపిరితిత్తుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్, డస్ట్ ఎలర్జీ, నెమ్ము.. ఇలా చాలా కారణాలవల్ల తరచూ మనం దగ్గు సమస్యతో బాధపడుతాం. చూడడానికి ఇది చాలా చిన్న ఇబ్బంది అనుకుంటాము.. అయితే తరచూ ఇలా దగ్గు రావడం ఆలోచించాల్సిన విషయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దగ్గు ఎక్కువగా రావడం వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (CHF) ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. అయితే అసలు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి.. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం పదండి..

గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేయలేని పరిస్థితిలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారికి తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, అలసట, కాళ్లు, పొత్తికడుపులో వాపు వంటివి ఏర్పడతాయి. మనకు తెలియకుండా అంతర్గతంగా ఉన్న గుండె సమస్యలకు తోడుగా ఈ దగ్గు యాడ్ అయినప్పుడు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సమస్య వస్తుంది

కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్

గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం..రక్తపోటు, గుండె కవాటాల వ్యాధి లాంటి వాటి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. గుండె కండరాల పనితీరు మందగించినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఊపిరితిత్తుల నుంచి రక్తం తిరిగి గుండెకు చేరుకునే సమయంలో తీవ్రమైన దగ్గు ఏర్పడితే.. ఆ సమయంలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తుంది.

ఈ సమస్య ఉన్నవారికి విపరీతమైన దగ్గు, గురక ఉంటాయి. నిద్రపోయేటప్పుడు, ఎక్కువ శారీరక శ్రమ చేసినప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో దగ్గినప్పుడు తెల్లని లేదా గులాబీ రంగులో ఉన్న రక్తంతో కూడిన కఫం వస్తుంది. గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం క్షీణించడంతో అలసట, బలహీనత ఏర్పడతాయి. గుండె దడ, నీరసం, ఏకాగ్రత లోపించడం, ఆకలి లేకపోవడం ఈ సమస్యతో బాధపడే వారిలో మనం గమనించవచ్చు.

సహజంగా ఇటువంటి వాటిని తగ్గించుకోవాలి అంటే సోడియం ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. గుండె ఆహారాన్ని పెంచే తాజా ఆకుకూరలు కూరగాయలను మన రోజువారి డైట్ లో భాగంగా చేసుకోవాలి. వీలైనంతవరకు ఆహారంలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తరచూ వ్యాయామం, యోగా వంటివి చేస్తూ రోజు ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. తరచూ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో పాటు క్రమబద్ధమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.

Tags:    

Similar News