కోవీషీల్డ్ గ్రహీతల వెన్నులో వణుకు... టెన్షన్ పుట్టించిన ఆస్ట్రాజెనికా!
కోవిడ్ మహమ్మారి కలిగించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని ప్రపంచం మొత్తం వాపోతున్న పరిస్థితి
కోవిడ్ మహమ్మారి కలిగించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని ప్రపంచం మొత్తం వాపోతున్న పరిస్థితి! ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ అల్లకళ్లోలం చేసేసింది. అయితే... దానికి వ్యాక్సిన్ ని కనుగొనడంతో... ఉన్నంతలో డ్యామేజ్ కంట్రోల్ అయ్యింది. ఈ సమయంలో... భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలు పంపిణీ చేశారు.
ఇందులో భాగంగా... కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా వేసింది. ఇదే క్రమంలో... అటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వీటిని ఉత్పత్తిదారుల నుంచి సేకరించి నామమాత్రపు ధరకు అందించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 85 శాతం మంది కొవాక్సిన్ లేదా కొవీషీల్డ్ తీసుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా కోవీషీల్డ్ నుంచి భయంకరమైన వాస్తవం ఒకటి అధికారికంగా బయటపడింది. అవును... తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆస్ట్రాజెనికా కంపెనీ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి ప్లేట్ లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తెలిపింది.
దీంతో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారి వెన్నులో వణుకు పుడుతుందని అంటున్నారు. అయితే ఈ సైడ్ ఎఫెక్టు విరివిగా కాకుండా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని తెలిపిన కంపెనీ... సరసరిన ఎంతమందిపై ఈ దుష్ప్రభావం చూపుతందనే లెక్కల్ని మాత్రం వెల్లడించలేదు.
మరోపక్క కొవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తాము తీవ్ర దుష్ప్రభావాలకు లోనైనట్టు బ్రిటన్ కు చెందిన సుమారు 51 మంది కోర్టులో కేసులు వేశారు. వీరిలో మొదట కేసు వేసిన జెమీ స్కాట్... ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తనకు శాశ్వత మెదడు వాపు వ్యాధి వచ్చినట్లు తెలిపాడు.
ఈ సందర్భంగా జరిగిన విచారణలో స్పందించిన ఆస్ట్రాజెనికా సంస్థ... పై విధంగా స్పందించింది. తమ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం గడ్డ కడుతుందని తెలిపింది. దీంతో.. ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి వెన్నులో వణుకు పుడుతుందని అంటున్నారు!