కరివేపాకు ఇలా తింటే ..కొవ్వు !
కరివేపాకు లేకుండా మన వంటకాలు ఏవీ ఉండవు. ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు పెంపకానికి ప్రాధాన్యం ఇస్తుంటాం
కరివేపాకు లేకుండా మన వంటకాలు ఏవీ ఉండవు. ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్టు పెంపకానికి ప్రాధాన్యం ఇస్తుంటాం. అయితే కరివేపాకులో ఆరోగ్య ప్రయోజనాలు మామూలువి కావు. ముఖ్యంగా కొవ్వును కరిగించడంలో కరివేపాకు బాగా పనిచేస్తుంది. జుట్టు సమస్యలను ఇది నయం చేయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను తీరుస్తుంది.
రోజూ కరివేపాకు ఆకులను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పూర్తిగా తగ్గి రక్తనాళాల్లోని కొవ్వు కరిగిపోతుంది. జీవన విధానంలో వచ్చిన ఆహారపు అలవాట్ల మూలంగా ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోయింది. అలాంటి వారికి సులభ మార్గం కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడంతో పాటు, కరివేపాకు వేసి నానబెట్టిన నీళ్లను ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో సేవించడం మూలంగా శరీరంలో కొవ్వును అరికట్టగలం.
కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, జుట్టు రాలే సమస్యల నివారణకు కరివేపాకులో నానబెట్టిన నీటిని తాగడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దృష్టి మెరుగుపడుతుంది. వివిధ రకాల కంటి సమస్యలను నివారిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి కరివేపాకు ఎక్కువ వాడాలి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతినడం నిరోధిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు రక్తహీనత సమస్యను తీరుస్తుంది.