తిన్న తర్వాత ఒక్క లవంగం ఛాయ్ తాగితే !

జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రెండు లవంగాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Update: 2024-06-07 23:30 GMT

భారతీయ వంటకాల్లో వినియోగించే మసాలా దినుసుల్లో లవంగం ఒకటి. లవంగాలు వంటలో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిని ఆహారంలో తీసుకుంటే అలసట, నిద్రలేమి, నోటి దుర్వాసన నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయి. ఆయుర్వేదం ప్రకారం లవంగాలు తినడం వల్ల ఎంజైమ్ స్రావాన్ని పెంచుతుంది.

మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నివారణకు ప్రతిరోజూ 2 లవంగాలు తీసుకోవాలని, జీర్ణక్రియకు ఉత్తమ ఔషధం అని చెబుతున్నారు.

జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రెండు లవంగాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

లవంగాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్‌తోపాటు ఇతర అనేక పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటాయి. లవంగాలలో విటమిన్-బి1, విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అలాగే వీటిల్లోని విటమిన్-కె, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు సహాయపడతాయి.

లవంగాలను ప్రతిరోజూ రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. వేడినీళ్లలో రెండు లవంగాలు, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి తీసుకుంటే రకరకాల శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రతి రోజూ భోజనం తర్వాత ఈ టీ తాగితే.. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు, వ్యాధులు నయమవుతాయి.

Tags:    

Similar News