జిమ్‌ లో మరణించిన యువకుడు... సీసీ కెమెరాల్లో రికార్డ్!

మనిషి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం కచ్చితంగా చేయ్యాలని చెబుతుంటారు.

Update: 2023-09-17 12:25 GMT

మనిషి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం కచ్చితంగా చేయ్యాలని చెబుతుంటారు. ఫిట్ గా ఉంటే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని అంటారు. ప్రతీరోజూ వ్యాయామం చేస్తే అనారోగ్యానికి దూరంగా ఉంటారని అంటుంటారు. అయితే ఈమధ్యకాలంలో వ్యాయామం చేస్తూ మరణిస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ విషయాలపై నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

అవును... జిమ్‌ చేస్తూ మరో యువకుడు మరణించిన ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్‌ లో సిద్ధార్థ్ అనే యువకుడు వ్యాయామశాలలో ట్రెడ్‌ మిల్‌ పై నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో 21 ఏళ్ల ఈ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమయంలో సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇతను నోయిడాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి అన్ని తెలుస్తుంది. ఇతడు తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం అని సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న తల్లితండ్రుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది. అతని గుండె ఆగిపోవడానికి 10 నిమిషాల ముందు తన తల్లితో ఫోన్‌ లో మాట్లాడాడని అంటున్నారు.

కాగా... గత ఏడాది నవంబర్‌ లో నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) తన జిమ్‌ లో కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ కూడా ట్రెడ్‌ మిల్‌ పై వర్కవుట్ చేస్తుండగానే ఛాతీలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు.

ఇలా పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌ లో వర్కవుట్ చేస్తూ హఠాత్తుగా మరణించిన ఘటనలు సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో నిపుణులు విలువైన సూచనలు చేస్తున్నారు. ట్రేడ్ మిల్ లేదా మరేదైనా కార్డియో ఎక్సర్‌ ‌ సైజ్ ఒకసారికి 10 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదని అంటారు!

ఇలా ప్రతి కార్డియో ఎక్సర్‌ సైజ్ తరువాత కనీసం 2 నుంచి 5 నిమిషాలు విరామం అవసరం అని.. దీనివల్ల గుండెకు కాస్త రిలాక్సేషన్ లభిస్తుందని అంటారు. అవసరానికి మించి వ్యాయామం మంచిది కాదని, సాధారణంగా 30 నిమిషాలు చాలని అంటారు. ఇక వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతీ ఎడమభాగంలో ఏదైనా నొప్పిలా అన్పిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు!

Full View
Tags:    

Similar News