కేరళలో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి!

చాలా మంది అనుమానిస్తున్నట్లు బయో వార్ లో భాగమో.. లేక, మరేదైనా కారణమో తెలియదు కానీ... దేశంలో మరోసారి నిపా వైరస్ కలకలం మొదలైంది

Update: 2023-09-12 09:51 GMT

చాలా మంది అనుమానిస్తున్నట్లు బయో వార్ లో భాగమో.. లేక, మరేదైనా కారణమో తెలియదు కానీ... దేశంలో మరోసారి నిపా వైరస్ కలకలం మొదలైంది. కరోనా నుంచి తేరుకుని కొంతకాలంగా రెగ్యులర్ లైఫ్ అనుభవిస్తున్న భారతీయులకు ఈ వైరస్ మరోసారి టెన్షన్ పెట్టడం మొదలుపెట్టింది. ప్రస్తుతం కేరళలో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది.

అవును... దేశంలోని మరోసారి ప్రమాదకర నిపా వైరస్ కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా తాజాగా కేరళలో ఈ వైరస్ బారినపడి ఇద్దరు మృతిచెందారని తెలుస్తుంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ మధ్యకాలంలో రెండు అసహజ మరణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో...పరిక్షించిన అనంతరం ఈ మరణాలకు నిపా వైరస్ కారణమని కేరళ ఆరోగ్య శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది.

అయితే ఈ అనుమానం నిజమనే సంకేతాలు వెలువడుతున్నాయంటూ వార్తలొస్తున్న నేపథ్యమంలో రాష్ట్ర వైద్యాధికారులతో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం నిఫా వైరస్ గురించి ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో ఆ ఇద్దరు మృతుల బంధువులు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

దీంతో... నిపా వైరస్ కలకలంపై మరోసారి చర్చ మొదలైంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నది వర్షాకాలం, రాబోయేది శీతాకాలం కావడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరని అంటున్నారు. దీంతో... ఈ అసహజ మరణాలకు గల కారణాల అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

వాస్తవానికి కేరళలోని కోజికోడ్ జిల్లాలో 2018 నుంచి 2021 మధ్య అనేక నిఫా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం దక్షిణాది విషయానికొస్తే ఇక్కడ మొదటి నిపా వైరస్ కేసు 2018 మే నెలలో నమోదయ్యింది. తర్వాత 2019లోనూ ఈ కేసులు వెలుగుచూడగా... 2021లో కూడా దీనికి సంబంధించిన గుర్తులు వైద్యులు కనుగొన్నారు!

కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా నిపా వైరస్‌ ను 1989లో మలేషియాలో గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా వ్యాధిగ్రస్త గబ్బిలాల మూత్రం పండ్లుపై చేరినప్పుడు.. వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే... దీనికి ప్రత్యేకమైన వ్యాక్సిన్లు, ఔషధాలు, చికిత్సా విధానం లేకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం అని తెలుస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. అయితే అసలు సమస్య ఏమిటంటే... ఈ వైరస్‌ లక్షణాలు తొందరగా బయటపడవు. ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే... ఈ వైరస్‌ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది.

ఈ క్రమంలో ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో ఈ వ్యాది లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇదే సమయంల్మో... ఈ వైరస్ సోకినవారిలో.. జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులతోపాటు మూర్ఛ, బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News