కోవిడ్ జేఎన్ 1 విషయంలో డబ్ల్యు.హెచ్.వో. రియాక్షన్ ఇదే!

అవును... కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 జేఎన్‌-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే.

Update: 2023-12-20 07:37 GMT

కొవిడ్‌ జేఎన్‌-1 వేరియంట్‌ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్‌ పంత్‌ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇందులో భాగంగా ఇటీవల కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని, కొత్త వేరియంట్‌ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు. ఈ సమయంలో అన్ని ప్రభుత్వాలు తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.వో) స్పందించింది.

అవును... కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 జేఎన్‌-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ వేరియంట్‌ గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ చెబుతున్నారు. అదేవిధంగా పలువురు వైద్య నిపుణులు ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే మాట చెబుతోంది. జేఎన్‌-1 అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని ప్రకటించింది.

ఇదే సమయంలో... ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలపై ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో ఈ జేఎన్‌-1 తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో దీన్ని "c"గా వర్గీకరించింది.

కాగా... కేరళలోని తిరువనంతపురం జిల్లా కరకుళం ప్రాంతంలో నవంబరు 18న నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో 79 ఏళ్ల బాధితురాలికి కొవిడ్‌ సోకినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే ఆ నమూనాలో జేఎన్‌-1 వేరియంట్ ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరులో జేఎన్‌-1 వేరియంట్ తొలిసారిగా అమెరికాలో వెలుగు చూడగా.. చైనా సహా పలు దేశాల్లో ఈరకం కేసులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

అయితే ఈ జేఎన్‌-1 వేరియంట్‌ సోకిన వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతానికి పూర్తిగా తెలియదు. సాధారణంగా కొవిడ్‌ సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వేరియంట్‌ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లతో ఈ వేరియెంట్ నుంచి రక్షణ కల్పించొచ్చని తెలిపింది.

Tags:    

Similar News