ఉద్యోగార్థులకు శుభవార్త... ఇంట్రస్టింగ్ విషయం చెప్పిన నివేదిక!
గత కొంతకాలంగా పింక్ స్లిప్ లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్న వేళ ఓ గుడ్ న్యూస్ వినిపించింది!
గత కొంతకాలంగా పింక్ స్లిప్ లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్న వేళ ఓ గుడ్ న్యూస్ వినిపించింది! త్వరలో నియామకాల వృద్ధి నమోదు కావొచ్చంటూ ఓ నివేదిక తెరపైకి వచ్చింది. ఏయే రంగాల్లో ఎంతెంతమేర నియామకాలు ఉండొచ్చు మొదలైన వివరాలతో టీమ్ లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. క్యాలెండర్ ఇయర్ ఎండింగ్ లో ఇదో పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలని అంటున్నారు!
అవును... 2024-25 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ - మార్చిలో 59% సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయంటు టీమ్ లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. దీంతో.. నియామకాల వృద్ధి సుమారు 7.1% నమోదు కావొచ్చని అంచనా వేసింది. "ఎంప్లాయి మెంట్ అవుట్ లుక్ రిపోర్ట్ ఫర్ 2024 అక్టోబర్ టు మార్చి 2025" పేరుతో ఈ నివేదికను రుపొందించింది.
ఇందులో ప్రధానంగా... ఇ-కామర్స్, లాజిస్టిక్స్, తయారీ రంగాలు అధికంగా ఉద్యోగుల్ని నియమించుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రకారం పలు సంస్థలు ప్రస్తుతం ఉన్న సిబ్బంది స్థాయిని అలాగే ఉంచాలని భవిస్తుండగా.. మరి కొన్ని నియామకాల కోసం చూస్తున్నట్లు తెలిపింది. 20 నగరాల్లో 1,307 సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించింది.
వీటిలో ప్రధానంగా బెంగళూరు (53.1%), ముంబై (50.2%), హైదరబాద్ (48.2%)తో ఇప్పటికే ఎంప్లాయిమెంట్ సెంటర్ పాయింట్స్ గా ఉండగా.. కొత్తగా కోయంబత్తుర్ (24.6%), గురుగ్రాం (22.66%) ఉద్యోగ నిలయాలుగా మారబోతున్నాయని.. జయపుర, లఖ్ నవూ, నాగ్ పూర్ తదితర నగరాల్లోనూ నియామకాలు పెరుగుతున్నాయని వెల్లడించింది.
నగరాల్లో పరిస్థితి అలా ఉండగా.. ఇక రంగాల విషయానికొస్తే... లాజిస్టిక్ రంగంలో 69% సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోబోతున్నాయని అంటున్నారు. అనంతరం... ఈవీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, అగ్రోకెమికల్స్, ఇ-కామర్స్, టెక్ స్టార్టప్స్ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాహన రంగం, రిటెయిల్ రంగాల్లో వృద్ధి 8.2 నుంచి 8.5% వరకూ ఉంటుంది!