దిగ్గజ ఐటీ సంస్థల కీలక నిర్ణయం.. ఉద్యోగులకు షాక్?

ఇదే సమయంలో ఇప్పటికే చాలామంది ఫ్రెషర్లను ఐటీ సంస్థలు తొలగిస్తున్నాయని చెబుతున్నారు

Update: 2023-07-17 09:56 GMT

గతకొంత కాలంగా పలు ఐటీ కంపెనీలు లే ఆఫ్ లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు మూడునాళ్ల ముచ్చటగా ఉంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో దిగ్గజ ఐటీ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయని తెలుస్తుంది.

అవును... అనిశ్చితి, ఆర్థిక వ్యయం కారణాలు చూపిస్తూ పలు దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను విధుల నుండి తొలగిస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో... కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చాలా ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపి వేశాయని తెలుస్తుంది.

దీంతో పలు కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా.. ఉద్యోగుల ప్రయోజనాలకు గండి కొడుతూ.. వారి పరిస్థితిని డోలాయమాన పరిస్థితికి తీసుకువస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇదే సమయంలో ఇప్పటికే చాలామంది ఫ్రెషర్లను ఐటీ సంస్థలు తొలగిస్తున్నాయని చెబుతున్నారు. ప్రొబిషన్ పిరియడ్ కు ముందే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల పెంపును వాయిదా వేయడంతోపాటూ.. మరోపక్క వార్షిక వేతనాలలో కోత విధించేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నాయని అంటున్నారు. దీంతో కొన్ని కంపెనీల్లోని ఐటీ ఉద్యోగుల పరిస్థితి... గడిగడి గంఢం గా ఉందని అంటున్నారంట పరిశీలకులు.

ఇందులో భాగంగా... సచిన్ బన్సల్ నవీ సంస్థతోపాటు ఎడెక్ట్ స్టార్టప్ స్కిల్ లింక్ తమ ఉద్యోగుల్లో చాలామందిని ఇంటికి పంపించడానికి రెడీ అయ్యాయని తెలుస్తుంది. మార్కెట్ పరిస్థితులను కారణంగా చూపెడుతూ.. ఇప్పటికే నవీ కంపెనీలో పనిచేస్తున్న 150 నుండి 200 మంది ప్రొడక్షన్, అనలిటిక్స్ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని అంటున్నారు.

ఇదే క్రమంలో ఎడెక్ట్ స్టార్టప్ స్కిల్ లింక్ కూడా తమ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించిందని తెలుస్తుంది. ఖర్చులు తగ్గించడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం ఈ చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. దీంతో పలు ఐటీ కమెపెనీల్లోని ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కనిపిస్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News