బ్యాడ్ న్యూస్: ఆ ఉద్యోగాలు తగ్గిపోయాయట

ఇటీవల కాలంలో డేటా రంగానికి చెందిన ఉద్యోగాలతో పాటు సైబర్ సెక్యూరిటీకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగిన విషయం తెలిసిందే.

Update: 2023-10-29 12:30 GMT

ఐటీ ఉద్యోగాలంటే గతానికి పోలిస్తే.. ఇటీవల కాలంలో డేటా రంగానికి చెందిన ఉద్యోగాలతో పాటు సైబర్ సెక్యూరిటీకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగిన విషయం తెలిసిందే. ఇందులోని వారికి ప్యాకేజ్ ఆకర్షణీయంగా ఉంటోంది. అయితే.. ఇదంతా మొన్నటి మాట అని.. ఇప్పుడు సీన్ మారిందంటున్నారు. తాజాగా వెలువడిన రిపోర్టు చూస్తే.. సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు తగ్గిన వైనం వెలుగు చేసింది.

గత ఏడాది సెప్టెంబరు నుంచి 25.7 శాతం సైబర్ సెక్యూరిటీ జాబ్ లు తగ్గిన విషయం వెల్లడైంది. నియంత్రణ నిబంధనలు కఠినతరం కావటంతో ఈ ఉద్యోగ అవకాశాలు తగ్గిన విషయాన్ని ఇండీడ్ వెల్లడించింది. అంతర్జాతీయ ఉద్యోగాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించే ఈ వెబ్ సైట్ తాజాగా వెల్లడించిన దాని ప్రకారం చూస్తే.. 2019నుంచి 2022 వరకు సైబర్ సెక్యూరిటీ ఉద్యోగులకు పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది.

కొవిడ్ టైంలోనూ సైబర్ సెక్యూరిటీ నిపుణులకు పెద్ద ఎత్తున గిరాకీ లభించింది. అయితే.. గత ఏడాది సెప్టెంబరు నుంచి మాత్రం సీన్ మారిందని పేర్కొంది. సైబర్ సెక్కూరిటీకి అప్పట్లోఅవకాశాలు ఎక్కువగా ఉండటం.. ఆకర్షణీయమైన జీతాలు ఉండటంతో వాటిపై ఫోకస్ పెరిగింది. అదే సమయంలో డిమాండ్ తగ్గటంతో రిక్రూట్ మెంట్ మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు అవకాశాలు పెద్ద ఎత్తున లేకున్నా.. రానున్న రోజుల్లో మాత్రం పరిస్థితులు మారే వీలుందన్న అంచనా వ్యక్తమవుతోంది.

ఇక.. దేశీయంగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులున్న మహానగరంగా బెంగళూరు ఉన్నట్లు చెబుతున్నారు. 23.11 శాతం ఉద్యోగులతో గార్డెన్ సిటీ నిలిస్తే. .తర్వాతి స్థానంలో ఢిల్లీ.. ముంబయి నిలిచింది. స్టార్టప్ లు ఎక్కువగా ఉన్న చోట సైబర్ భద్రత ముప్పు ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సైబర్ సెక్యూరిటీపై పని చేసే వారికి మాత్రం ప్రస్తుతం కాస్తంత గడ్డు పరిస్థితి నడుస్తుందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News