గంటకు రూ.3 కోట్లు సంపాదించే ఈ కుబేరుడిని గుర్తుపట్టారా?

సోషల్ మీడియాలో సినిమా స్టార్స్, క్రికెటర్స్ తో పాటు పలువురు సెలబ్రెటీస్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతుంటూ ఉంటున్న సంగతి తెలిసిందే.

Update: 2024-02-17 04:02 GMT

సోషల్ మీడియాలో సినిమా స్టార్స్, క్రికెటర్స్ తో పాటు పలువురు సెలబ్రెటీస్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతుంటూ ఉంటున్న సంగతి తెలిసిందే. "ఈ ఫోటోలోని స్టార్ ని గుర్తుపట్టారా"? అంటూ ఫజిల్స్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రపంచ కుబేరుడి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల్లో ఒకరైన ఇతడిని గుర్తుపట్టారా అంటూ ఒక ప్రశ్న నెట్టించ చక్కర్లు కొడుతుంది.


ఈ నేపథ్యంలో ఈయనకు సంబంధించిన హింట్ కూడా ఇస్తున్నారు. అదేమిటంటే... ఈయన సంపాదన గంటకు మూడు కోట్ల రూపాయలకు పైనే అని. దీంతో... గూగుల్ లో సెర్చింగ్ మొదలైంది. ఆయన మరెవరో కాదు... స్పేస్ ఎక్స్ అధినేత, ఎక్స్ (ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్. అవును... చిన్ననాటి నుంచి కంప్యూటర్ కు సంబంధించిన విషయాలపై ఎంతో ఆసక్తి ఉన్న ఈ కుబేరుడు.. ఈ ఫోటోలో కూడా "స్మార్ట్" వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ కళ్లల్లో ఏకాగ్రత స్పష్టంగా కనిపిస్తుంది.

ఎలాన్ మస్క్ నిమిషానికి సుమారు 5.71 కోట్ల రూపాయలు, గంటకు 3 కోట్ల రూపాయలకు పైనే సంపాదిస్తున్నాడనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతానికి 198.9 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్న మస్క్... రోజుకు 99,17,280 డాలర్లు అంటే... భారత కరెన్సీలో సుమారు 82.33 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

కాగా... మస్క్‌ 1971 జూన్‌ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. ఈయన తండ్రి ఎర్రల్‌ ఒక ఇంజినీర్‌ కాగా.. తల్లి మే ఒక మోడల్‌. మస్క్ కు తొమ్మిదేళ్ల వయసప్పుడు 1980లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో.. నాటి నుంచీ తండ్రి వద్దనే ఉన్నాడు. పెద్దయ్యాక ఆయన నుంచి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మస్క్‌ 12ఏళ్ల వయస్సులోనే "బ్లాస్టర్‌" అనే వీడియో గేమ్‌ ను తయారు చేయగా... పీసీ అండ్‌ ఆఫీస్‌ టెక్నాలజీ అనే సంస్థ దీనిని 500 డాలర్లకు కొనుగోలు చేసింది.

అలా మొదలైన ఎలాన్ మస్క్ (టెక్నికల్) లైఫ్.. ఈ రోజు స్పేస్ ఎక్స్ అనే సంస్థకు అధినేత, ఎక్స్ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం కు యజమానిని చేసింది. ఫలితంగా ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో టాప్ టూ లో ఉన్నారు మస్క్. ఇదే సమయంలో మస్క్ మానసపుత్రిక “టెస్లా” ఇప్పుడు టాప్ కార్ల కంపెనీల్లో ఒకటిగా ఉంన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News