16 రకాల పురుగులను వంటలకు ఉపయోగించే దేశం ఏదో తెలుసా?

ఇక సింగపూర్ కి వచ్చే పురుగులు చాలావరకు చైనా, జపాన్, వియ‌త్నాం నుంచి దిగుమతి చేయబడతాయి.

Update: 2024-07-09 17:30 GMT

చాలా దేశాలలో పురుగులను తింటారు అన్న విషయం మనకు తెలుసు అయితే తాజాగా సింగపూర్లో 16 రకాల పురుగులను తినడాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈ పురుగులకు సంబంధించిన వివరాలతో పాటు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఇకనుంచి సింగపూర్లో ఈ 16 రకాల పురుగులను నిరభ్యంతరంగా వండుకొని తినవచ్చు. అంతేకాదు రెస్టారెంట్ లో కూడా ఈ 16 పురుగులకు సంబంధించిన వెరైటీ డిషెస్స్ సర్వ్ చేస్తారు..

సింగ‌పూర్‌లో ప్రజలు ఎక్కువగా క్రికెట్స్, మిడ‌త‌లు, గొల్ల‌భామ‌లు, ప‌ట్టుపురుగుల‌ను తింటారు.అక్కడ రెస్టారెంట్స్ లో కూడా ఈ పదార్థాలతో చేసే వంటకాల సంఖ్య 30% ఎక్కువగా ఉంటుంది. ఇక సింగపూర్ కి వచ్చే పురుగులు చాలావరకు చైనా, జపాన్, వియ‌త్నాం నుంచి దిగుమతి చేయబడతాయి.అయితే ఈ పురుగులను పండించాలి అనుకునే రైతులు.. దిగుమతి దారి కచ్చితంగా సింగపూర్ ఫుడ్స్ ఏజెన్సీ (SFA) నిబంధ‌న‌ల‌ను ఆచరించాలి. సింగపూర్ ఫుడ్స్ ఏజెన్సీ ఆమోదించిన నిబంధనల ప్రకారమే ఈ పురుగుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. అంతేకానీ నేరుగా ఆడవాళ్ళ నుంచి తీసుకువచ్చి అమ్ముతాము అంటే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

పెరుగుతున్న జనాభా దృశ్య మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వీటిని తినడం మంచిది అని యునైటెడ్ నేష‌న్స్ ఫుడ్ అండ్ ఆగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేషన్ (UNFAO) సంస్థ వెల్ల‌డించింది. ఇక ఈ కీటకాలకు సంబంధించి సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని మానవ వినియోగం లేక పశువుల మేత కోసం మాత్రమే దిగుమతి చేసుకోవడం కు అనుమతి ఉంటుంది. ఈ సంస్థ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కీటకాలను ఆహార భద్రత నియంత్రణలతో సాగు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ జాబితాలో పేర్కొనబడిన 16 కీటకాల జాతులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి మూల్యాంకనం చేస్తారంట.

కీటకాలు ఉపయోగించి చేసిన ప్రీ ప్యాకెడ్ ఫుడ్స్ విక్రయించే కంపెనీలు ప్యాకేజింగ్ లేబుల్ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులు ఈ ఉత్పత్తిని కొనాలా వద్దా అనే విషయంపై అవగాహన కలిగి ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి సింగపూర్లో 16 రకాల కీటకాలు ఆహార ప్రియులను అలరించడానికి రెడీగా ఉన్నాయి.

Tags:    

Similar News