సైఫ్ అలీఖాన్ ఫిట్ నెస్ పై డౌట్స్... డాక్టర్ షాకింగ్ కామెంట్స్!
ముంబైలోని తన నివాసంలోకి చొరబడిన దొంగ జరిపిన దాడిలో ఈ నెల 16 తెల్లవారుజామున బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే.
ముంబైలోని తన నివాసంలోకి చొరబడిన దొంగ జరిపిన దాడిలో ఈ నెల 16 తెల్లవారుజామున బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం అతడికి లీలావతీ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ఈ సమయంలో శస్త్ర చికిత్స చేసి వెన్నులోకి దిగిన కత్తి ముక్కను తొలగించారు.
ఈ నేపథ్యంలో.. చికిత్స అనంతరం ఆరో రోజు మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా.. శిండే శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ.. కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు. దీంతో... ఈ సందేహాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై వైద్యులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
అవును... తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సంజయ్ నిరుపమ్... 2.5 అంగుళాల కత్తి సైఫ్ కి గుచ్చుకుంది.. అతనికి ఆపరేషన్ జరిగింది.. అయినప్పటికీ నాలుగు రోజుల తర్వాత అతడు ఆస్పత్రి నుంచి బయలుదేరి, ఏమీ పట్టనట్లు దూకుడుగా నడుచుకుంటూ కనిపించాడు.. ఇంత త్వరగా కోలుకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా కూడా సైఫ్ డిశ్చార్జ్ వీడియోపై కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో బెంగళూరులోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ హెచ్.ఓ.డీ. డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి స్పందించారు. ఎక్స్ వేదికగా తన తల్లికి సంబంధించిన వీడియోనూ పోస్ట్ చేసిన ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... సైఫ్ అలీఖాన్ కు నిజంగానే వెన్నెముక ఆపరేషన్ జరిగిందా లేదా అనే సందేహం ప్రజలతో పాటు కొందరు వైద్యులు కూడా వ్యక్తపరచడం తమాషా అన్నట్లుగా స్పందించిన ఆయన... ఓ వీడియోను పోస్ట్ చేశారు. అది 2022లో 78 ఏళ్ల వయసులో తన తల్లికి సంబంధించిన వీడియోగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆ వయసులో తన తల్లికి వెన్నెముక ఆపరేషన్ జరిగిందని.. అదే రోజు సాయంత్రం ఆమె వాకర్ సహాయంతో నడిచారని.. ఇక ఫిట్ గా ఉండే వ్యక్తులు మరింత వేగంగా కోలుకోవచ్చని.. ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ కోలుకోవడం పెద్ద విషయం కాదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ, వీడియోను షేర్ చేశారు.
అనంతరం మరో పోస్ట్ లో స్పందించిన ఆయన... ఈ రోజుల్లో కార్డియాక్ బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్న వ్యక్తులే 3 నుంచి 4 రోజుల్లో నడిచి మెట్లు ఎక్కుతున్నారు! అని చెబుతూ... దయచేసి సోషల్ మీడియాలోకి వచ్చే ముందు మీ అజ్ఞానాన్ని గర్వంగా ప్రదర్శించే ముందు మీ విషయాల గురించి అవగాహన చేసుకోండి.. నిపుణులతో మాట్లాడండి.. చదివి తెలుసుకోండి అని సూచించారు.
దీంతో... సైఫ్ అలీఖాన్ ఫిట్ నెస్ పై వస్తున్న సందేహాలకు అద్భుతమైన రీతిలో ఆన్సర్ వచ్చేసినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.