వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపారవేత్తకు గాయాలు.. తాజాగా కన్నుమూత!

కింద పడిన సమయంలో ఆయన తలకు గాయమైందని.. మెదడులో రక్తస్రావం కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.

Update: 2023-10-24 04:26 GMT

వీధి కుక్కలు ఒక వ్యాపారవేత్త ప్రాణాలు పోయేందుకు కారణమైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేయటం.. మరణించటం లాంటి ఉదంతాలు ఆ మధ్యన హైదరాబాద్ మహానగరంలోచోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా ఉదంతంలోకి వస్తే.. ఒక ప్రముఖ వ్యాపారవేత్త వీధికుక్కల దాడిలో గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా కన్నుమూసిన షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది.

ఛాయ్ ప్రియులకు సమ్ థింగ్ స్పెషల్ గా ఫీలయ్యే టీ పొడి వాఘ్ బక్రీ టీ. భిన్నమైన టీ పొడుల్ని వినియోగించే వారు.. ఈ బ్రాండ్ ను వాడుతుంటారు. ఆన్ లైన్ లో ఎక్కువగా.. ఆఫ్ లైన్ లో ఒక మోస్తరుగా లభించే వాఘ్ బక్రీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుంటారు పరాగ్ దేశాయ్. దేశ రాజధాని ఢిల్లీలో వారం క్రితం ఆయన వీధిలోకి వచ్చిన వేళ.. వీధి కుక్కులు ఆయనపై దాడి చేశాయి. ఈ సందర్భంగా ఆయన గాయపడ్డారు. భద్రతా సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

కింద పడిన సమయంలో ఆయన తలకు గాయమైందని.. మెదడులో రక్తస్రావం కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన్ను రక్షించేందుకు వైద్యులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆయన మరణం వ్యాపార ప్రపంచంలో షాకింగ్ గా మారింది. ఆయన మరణంపై కాంగ్రెస్ ఎంపీ శక్తి సిన్హా గోహిల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పలువురు వ్యాపార ప్రముఖులు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేశారు.

ఈ కంపెనీకి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు. వారిలో పరాగ్ దేశాయ్ ఒకరు. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన ఆయన.. కంపెనీకి సంబంధించిన అమ్మకాలు.. మార్కెటింగ్.. ఎక్స్ పోర్ట్ విభాగాల్ని ఆయన పర్యవేక్షిస్తుంటారు. 1892లో నరన్ దాస్ దేశాయ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.2వేల కోట్లుగా చెబుతారు.

Tags:    

Similar News